ట్రంప్ కౌంట్ డౌన్ స్టార్ట్.. మరో రెండేళ్లు పాలన మాత్రమే… ఒబామా

Barack Obama Targets Donald Trump,

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎన్నికల ఫలితాలపై స్పందించారు..అమెరికా ప్రజలు రాజకీయ విభేదాలను మరింత పెంచే నాయకత్వాన్ని కోరుకోవడం లేదని, అందరినీ కలుపుకొని వెళ్లే పాలనను ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపించడమే నాయకుల ప్రధాన బాధ్యత కావాలని సూచించారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసిన డెమోక్రటిక్ అభ్యర్థులను ఒబామా అభినందించారు. గతంలో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు పోటీకి ముందుకొచ్చారని గుర్తుచేశారు. విభిన్న నేపథ్యాలు, రాజకీయ అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాసేవ పట్ల ఉమ్మడి నిబద్ధతతో పనిచేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అధికారులను, వాలంటీర్లను కూడా ఒబామా అభినందించారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సిబ్బంది ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేశారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ అమెరికా ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటని పేర్కొన్నారు.