ఖానాపూర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ దాడులు..

ఖానాపూర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ దాడులు..

మొత్తం రెండు చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు..

రూ.40.96 కోట్ల సీఎంఆర్ ధాన్యం అక్రమాల కేసు నేపథ్యంలో ఈడీ సోదాలు..

సత్తెనపల్లిలోని రేఖా నాయక్‌కు చెందిన ‘ఏఆర్ఎస్ ఇండస్ట్రీస్’ రైస్ మిల్లులో భారీగా ధాన్యం మాయం.!?.

ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో 9,639.962 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గతంలోనే తేల్చిన పౌరసరఫరాల శాఖ.

గతంలోనే రేఖా నాయక్‌పై BNS సెక్షన్లు 316(2), 316(5), 318(4), నిత్యావసర సరుకుల చట్టం కింద కేసు నమోదు..

ధాన్యం గోల్‌మాల్‌లో మనీలాండరింగ్ కోణంపై ఆరా తీస్తున్న ఈడీ అధికారులు..

ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరిట ఉన్న ఏఆర్‌ఎస్ రైస్ మిల్లులో మూడు రబీ సీజన్లకు సంబంధించిన 9,639.962 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు , మాయమైన ధాన్యం విలువ రూ.40.96 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా వేసి కేసు నమోదు చేశారు.

ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో చూపకుండా మళ్లించా రని, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారని అధికారుల నివేదికను రూపొందించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఫిర్యాదుతో రేఖా నాయక్‌పై క్రైమ్ నంబర్ 165/2026 కింద ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.