పాకిస్తాన్ ఎప్పుడు కుట్ర కోరుతున్నాను వ్యవహరిస్తుందని మరోసారి ఆఫ్గనిస్తాన్ బయటపెట్టింది… పాక్ ద్వంద్వ వైఖరి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో బట్టబయలైంది. పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ తాజాగా భారత పర్యటనకు రావడంపై అఫ్గానిస్తాన్ పౌరులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు..గతేడాది అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఇండియాలో పర్యటించినప్పుడు ఆయనను భారత గూఢచారి అని నిందించిన పాకిస్థాన్.. ఇప్పుడు తమ మంత్రి ఢిల్లీకి వెళ్తే మాత్రం దాన్ని దౌత్యం అని సమర్థించుకోవడంపై అఫ్గాన్లు తీవ్రంగా మండిపడుతున్నారు..
ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ తొలి ఎడిషన్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఇండియాకు వచ్చారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గతంలో సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై ‘చేతులు నరికేస్తాం’ అంటూ వివాదాస్పద, రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన ముసాదిక్ మాలిక్‌నే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ సదస్సుకు పంపడం గమనార్హం. దీన్ని బట్టి ఇండియాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశం పాకిస్థాన్ కు ఏ మాత్రం లేదని స్పష్టమవుతోంది..
పాక్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన అఫ్గాన్లు
పాక్ మంత్రి ఢిల్లీ పర్యటనపై అఫ్గానిస్థాన్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బుర్హాన్ ఉద్దీన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. “అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఇండియాకు వెళ్తే ఆయనను భారత గూఢచారి అని ముద్ర వేస్తారు.. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తారు. కానీ పాకిస్తాన్ మంత్రి ఇండియాకు వెళ్తే మాత్రం దాన్ని గొప్ప దౌత్యనీతి అని పిలుస్తారు. ఇదెక్కడి ద్వంద్వ ప్రమాణం?” అంటూ బుర్హాన్ ఉద్దీన్ ప్రశ్నించారు..
మాలిక్ ఇలా అన్నారు..
భారత్, పాకిస్తాన్ల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో సంస్కృతి పాత్ర గురించి అడిగినప్పుడు, మాలిక్ ఇలా అన్నారు, “సంస్కృతికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. సంస్కృతి కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు, దానికి ప్రాంతీయ పాత్ర కూడా ఉంది. మనం ఒకరి ఆలోచనా విధానాలను, జీవన విధానాలను అర్థం చేసుకోనంత వరకు పురోగతి సాధించలేము. సంభాషణల ద్వారా, మనం ఒకరి దృక్కోణాన్ని, అవగాహనను తెలుసుకుంటాము మరియు ఈ విధంగా ఈ ప్రాంతం ముందుకు సాగగలదు.” ఇదిలా ఉండగా, పాకిస్తానీ మేధావి ఖుర్రం అబ్బాస్, తన మంత్రికి స్వాగతం పలకడానికి విమానాశ్రయానికి ఏ భారత అధికారి రాలేదని, న్యూఢిల్లీలోని పాకిస్తానీ రాయబార కార్యాలయం ఆయనకు స్వాగతం పలికిందని పేర్కొన్నారు; అయితే, పాకిస్తానీ మంత్రికి స్వాగతం పలకడానికి భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్, విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హాజరయ్యారని వర్గాలు తెలిపాయి.