ఇందిరమ్మ బీమాలో ‘నామినీ చిక్కులు…!

ఇందిరమ్మ బీమాలో ‘నామినీ చిక్కులు. ఒంటరి కార్డుదారులకు బీమా కష్టాలు నిబంధనలు సవరించాలని లబ్ధిదారుల డిమాండ్..!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం నమోదు ప్రక్రియలో సాంకేతికపరమైన, విధ నపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా కుటుంబంలో ఒక్కరు మాత్రమే సభ్యుడిగా ఉన్న సింగిల్ రేషన్ కార్డుదారుల పరిస్థితి అయోమయంగా మారింది.బీమా నమోదు సమయంలో నామినీ వివరాలు తప్పనిసరి చేయాలి, రేషన్ కార్డులో ఇతర కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడంతో నామినిగా ఎవరిని నమోదు చేయాలో తెలియక లబ్దిదారులు, క్షేత్రస్థాయి సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి.? నవంబర్ 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు, డిసెంబర్ 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం పౌరసరఫరాల శాఖ డేటా ఆధారంగా రేషన్ కార్డులో సభ్యుల వివరాలను సరిపోల్చి నమోదు ప్రక్రియ చేస్తున్నారు. బీమా పొందే వ్యక్తి తన నామిని వివరాలను విధిగా నమోదు చేయాలి. అయితే, నమోదు యాప్ మరియు వెబ్ పోర్టల్లో రేషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయగానే, ఆ కార్డులో ఉన్నకుటుంబసభ్యుల పేర్లు మాత్రమే తెరపై కనిపిస్తున్నాయి. సింగిల్ కార్డుదారుల సమస్య ఇది రాష్ట్రంలో ఒంటరి మహిళలు, వితంతువులు, అవి వాహితులు, తల్లిదండ్రుల నుంచి పెళ్లిళ్లు అయ్యి వారి రేషన్ కార్డు వారు పెట్టుకోని విడిపోయి ఉన్నారు పేరుపైనే రేషన్ కార్డు ఉన్నవారు లక్షల్లో ఉన్నారు.

వీరి రేషన్ కార్డులో దరఖాస్తుదారుడి పేరు మాత్రమే ఉండటంతో, సాఫ్ట్‌వేర్‌లో నామిని ఎంపిక చేసుకునే ఆప్షన్ రావడం లేదు. రేషన్‌లో లేని ఇతర రక్తసంబంధీకులను ఉదాహరణకు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా వివాహమైన పిల్లలు నామినిగా చేర్చడానికి వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఎంపిక ఇవ్వబడిన సింగిల్ కార్డుదారుల దరఖాస్తులు ముందుకు సాగడం లేదు. మరోవైపు. రేషన్ కార్డు లేని వారి కోసం ప్రత్యేక ఫారం అందుబా టులో ఉంచారు, సింగిల్ రేషన్ కార్డు ఉన్నవారి విషయంలో ఎలాకెళ్లాలనే దానిపై అధికా రులకు స్పష్టమైన ఆదేశాలు లేవు ప్రభుత్వ మార్గదర్శ కాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకంలో కొన్ని వెసులుబాట్లు కల్పించేందుకు, సింగిల్ కార్డుదారుల అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. బీమా మొత్తం కుటుంబంలో సంపాదించే వ్యక్తి 18-59 ఏళ్ల వయసు గల వారు అకాల మరణం చెందితే నామినిలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.ఒకరికంటే ఎక్కువ మంది నామినీలను పెట్టుకునే అవకాశం,భవిష్యత్తులో నామినీ చనిపోయినా లేదా మార్చుకోవాలన్నా సవరించుకునే వెసు లుబాటు ఉంది.మైనర్ నామినీ అయితే సంరక్షకుడి వివరాలు ఇవ్వాలి. లబ్దిదారుల డిమాండ్ నమోదు గడువు డిసెంబర్ 18తో ముగియనున్న నేపథ్యంలో, సాంకేతిక సమస్యల వల్ల తాము రూ.5 లక్షల బీమా రక్షణ కోల్పోయే ప్రమాదం లేదని సింగిల్ రేషన్ కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులో పేరు లేకపోయినా రక్త సంబంధీకులను లేదా చట్టబద్ధమైన వారసులను నామినిగా నమోదు చేసుకునే యాప్‌లో తక్షణమే మార్పులు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.