మోదీ సలహాతో భారీ బంగారు నష్టలోనుండి వ్యాపారులను కాపాడిందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) నివేదిక..

దాదాపు భారతదేశంలో ప్రతి కార్యక్రమానికి బంగారాన్ని బహుమతిగా ఇయ్యటం కొంత ఆచారమే అయినప్పటికీ బంగారం కొనుగోలు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తో చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం ఆపేశారు.. బంగారంపై ఎప్పుడు ఏ నిర్ణయం ఉండబోతుందో అని ముందస్తు భయంతో కొనుగోలు ఆపేసినట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు… వ్యాపారస్తులకు చిన్న సలహాతో లక్షలాది మంది వ్యాపారులను భారీ నష్టాల నుంచి కాపాడిందని చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) పేర్కొంది…ఈ మేరకు నవంబర్ 22న మోదీకి లేఖ రాసిన సంస్థ.. ఆయన సూచనను పాటించడం వల్ల అధిక ధరలకు బంగారం కొనుగోలు చేయకుండా వ్యాపారులు నష్టాల నుంచి తప్పించుకున్నారని తెలిపింది.

బంగారం ధరలు కిలోకు సుమారు రూ.1.90 కోట్ల వద్ద ఉన్న సమయంలో మోదీ కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారని సీటీఐ గుర్తుచేసింది. ఆ తర్వాత ధరలు కిలోకు రూ.1.25 కోట్ల స్థాయికి పడిపోయాయని పేర్కొంది. అంటే కిలో బంగారంపై సుమారు రూ.65 లక్షల తగ్గుదల నమోదైందని తెలిపింది. ఆ సమయంలో వ్యాపారులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి ఉంటే భారీ నష్టాలను ఎదుర్కొనేవారని, అప్పులపాలై దివాలా తీసే పరిస్థితి వచ్చేదని లేఖలో వివరించింది…దేశవ్యాప్తంగా లక్షలాది ఆభరణాల వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బంగారం విక్రయదారులు ఈ సూచనతో ప్రయోజనం పొందారని సీటీఐ పేర్కొంది. ప్రధాని సలహా తమను కాపాడిందంటూ పలువురు వ్యాపారులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని వెల్లడించింది.

మరోవైపు, బంగారం ధరలు తగ్గడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్‌లో సామాన్య కుటుంబాలకు ఊరట లభిస్తోందని సంస్థ తెలిపింది. సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్న నేపథ్యంలో తక్కువ ధరలకు బంగారం కొనుగోలు చేసే అవకాశం కలిగిందని పేర్కొంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల మార్కెట్లలో ఊహాగానాలు, నిల్వల నియంత్రణ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేయాలని సీటీఐ కోరింది..

ఆదివారం నాటి ఒక లేఖలో, ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తి, అప్పట్లో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, వ్యాపారులు గణనీయమైన ఆర్థిక నష్టాలను నివారించడంలో సహాయపడిందని సీటీఐ పేర్కొంది. ‘మీ ముందుచూపు లక్షలాది మంది నగల వ్యాపారులను, పెట్టుబడిదారులను అప్పుల్లో కూరుకుపోకుండా కాపాడింది’ అనే శీర్షికతో ఆ లేఖను రాశారు. ఆ వాణిజ్య సంస్థ ప్రకారం, అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పౌరులకు సలహా ఇచ్చినప్పుడు కిలో బంగారం ధర రూ. 1.90 కోట్లుగా ఉంది. అప్పటి నుండి దాని ధర కిలోకు రూ. 65 లక్షలు తగ్గి, రూ. 1.25 కోట్లకు పడిపోయింది…ఒకవేళ వ్యాపారులు మీ సలహాను విస్మరించి ఆ సమయంలో బంగారం కొనుగోలు చేసి ఉంటే, ఈ రోజు వారు కిలోగ్రాముకు రూ. 65 లక్షల నష్టాన్ని చవిచూసి ఉండేవారు. లక్షలాది మంది నగల వ్యాపారులు అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసి ఉండేవారు,” అని ఆ లేఖలో పేర్కొన్నారు.