కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్లో జరిగిన భారీ సభలో ఆయన మాట్లాడుతూ…. ఓట్ల చోరీ (ఓట్ చోరీ) జరిగిందంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రజలు, ఓట్లు రెండూ బీజేపీ వెంటే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసలు ఓటర్ల జాబితాలో చొరబాటుదారుల పేర్లను చేర్చాలని వకాల్తా పుచ్చుకుంటున్నారని నితిన్ నబీన్ ఆరోపించారు….దేశంలో 13 కోట్ల మంది ఓట్లు చోరీకి గురయ్యాయని రాహుల్ గాంధీ చేస్తున్న వాదనను నితిన్ నబీన్ తప్పుబట్టారు. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న విమర్శలకు పలు గణాంకాలతో బదులిచ్చారు..దేశంలో 13 కోట్ల మంది ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ జీ అంటున్నారు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను.. అసలు ఆ 3 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితాలో ఎందుకు చేర్చాలి….? దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లారు. తెలంగాణలోనూ లక్షలాది మంది తమ ఓట్లను మార్చుకున్న విషయం నాకు తెలుసు. అలాంటప్పుడు ఒకే వ్యక్తిని రెండు చోట్ల ఓటు వేయడానికి అనుమతించాలా….? ఇక మిగిలిన 3 కోట్ల మంది విషయానికి వస్తే.. 2003లో ఎన్నికల సంఘం వారి ఆచూకీపై విచారణ జరిపినప్పుడు వారి వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఇలాంటి 3 కోట్ల మంది చొరబాటుదారుల కోసం వకాల్తా పుచ్చుకుంటున్న వ్యక్తి మరెవరో కాదు….. రాహుల్ గాంధీయే” అని నితిన్ నబీన్ ఆరోపించారు.
కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన సభ కంటే కరీంనగర్ సభకు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున జనాన్ని సమీకరించారని ఆయన వ్యాఖ్యానించారు…ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ జీ పదేపదే చెబుతుంటారు. రాహుల్ జీ.. ప్రజలు మాతో ఉన్నారు, ఓట్లు మాతోనే ఉన్నాయి. కరీంనగర్ ప్రజలు తమ ఆశీర్వాదం మాకేనని నిరూపించారు. ఇండియా కూటమి నేతలు తమ శక్తియుక్తులన్నీ ధారబోసినా కనీసం ఒక్క రాంలీలా మైదానాన్ని కూడా నింపలేకపోయారు. కానీ బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రాంతాల్లో రాంలీలా మైదానంలో పట్టే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మంది ప్రజలను సమీకరించారు” అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం ప్రతిని పట్టుకుని తిరుగుతుండటంపై నితిన్ నబీన్ విమర్శలు చేశారు. దేశంలో అరాచకం సృష్టించాలని చూసే వారి కుట్రలను సాగనివ్వబోమని ఆయన హెచ్చరించారు.
రీంనగర్ జిల్లా మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు సొంత జిల్లా అని గుర్తుచేసిన నితిన్ నబీన్…. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పీవీకి కాంగ్రెస్ నాయకత్వం తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపైనా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక ‘ఏటీఎం’లా పనిచేస్తున్నారని నితిన్ నబీన్ ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, రాష్ట్రంలో తదుపరి అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఓట్ చోరీ ఆరోపణలపై కౌంటర్
రాహుల్ గాంధీ తరచూ ‘ఓట్ చోరీ’ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నితిన్ నబీన్ మండిపడ్డారు. “రాహుల్ రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుంటే, మేము దానిని మా గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తున్నాం. దేశంలో 13 కోట్ల ఓట్లు చోరీ అయ్యాయని రాహుల్ అంటున్నారు. మరి 3 కోట్ల మంది చనిపోయినా వారి పేర్లు ఓటర్ల జాబితాలో అలాగే కొనసాగాలా? ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన 6 కోట్ల మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండాలా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. చొరబాటుదారులకు ఓటు వేసే హక్కును రాజ్యాంగం ఎక్కడా కల్పించలేదని గుర్తుచేశారు.
కాంగ్రెస్‌కు 90 సీట్లు ఎలా వస్తాయి?:
బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ ఉనికి లేదంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకసారి కరీంనగర్ గడ్డపైకి వచ్చి ఈ జనసందోహాన్ని చూడాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమకు 90 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.