జనసేనలో పదవి చిచ్చు.. ఆత్మకూరులో వైస్ చైర్మన్ ఎన్నికతో కూటమిలో కలకలం..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిపై రాజకీయ రగడ
వైస్ చైర్మన్ అభ్యర్థిగా జనసేన శిరీషను ప్రకటించడంతో కూటమిలో అసంతృప్తి
శిరీష అభ్యర్థిత్వంపై కూటమి కౌన్సిలర్లలో కొందరి అభ్యంతరం
జనసేన రెబల్ అభ్యర్థిగా 11వ వార్డు నుంచి గెలిచిన శిరీషకు పదవి ఇవ్వడంపై వ్యతిరేకత
చైర్మన్గా డాక్టర్ షకీలా, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తి
కౌన్సిల్ సభ్యుల అభ్యంతరాలపై నిరసనకు దిగిన వైస్ చైర్మన్ శిరీష
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు, కార్యకర్తల ఆందోళన
నిరసన చేస్తున్న జనసేన నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు..
కూటమి ఒప్పందంలో భాగంగా వైస్ చైర్పర్సన్ పదవిని జనసేనకు కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పదవికి కౌన్సిలర్ నలిశెట్టి శిరీష పేరును ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, చివరి నిమిషంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యంతో శిరీషకు బదులుగా మరో జనసేన కౌన్సిలర్ పద్మ పేరును తెరపైకి తీసుకురావడం వివాదానికి కారణమైందని స్థానిక జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తమ పార్టీ అధినేత నిర్ణయానికి భిన్నంగా అభ్యర్థిని మార్చడాన్ని నిరసిస్తూ ఆత్మకూరు జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, ఇతర నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న ఇన్చార్జ్ శ్రీధర్తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..