కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలపై నేడు చర్యలు తీసుకునే అవకాశం..!?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డిలపై నేడు చర్యలు తీసుకునే అవకాశం..!?
ఈ రోజు చర్యలు ఉంటాయని అచ్చంపేట మీడియా సమావేశంలో ప్రకటించిన నాగర్ కర్నూలు ఎంపీ, క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి
తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్ నేడు హైదరాబాద్‌కు రాక
గాంధీభవన్‌లో నేడు కీలక సమావేశం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న మల్లు రవి వ్యాఖ్యలు
బీఎం సందీప్‌తో సమావేశం కావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం
ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి ప్రకటించడం వెనక ఆంతర్యం ఏమిటి?
కొండా సురేఖ మాదిరే రేవంత్ వర్గం ఎమ్మెల్యేల మీద వేటు వేయిస్తుందా?
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు తప్ప పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల మీద ఏం చర్యలు తీసుకుంటారు?
షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేక సస్పెండ్ చేస్తారా?
సస్పెండ్ చేస్తే రాజగోపాల్ రెడ్డి వెనక ఉన్న ఎమ్మెల్యేలు ఎంత మంది?
రేవంత్ రెడ్డి, పొంగులేటి కుటుంబ దోపిడీపై అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు రగులుతున్నారా?
ఎమ్మెల్యేలకు కనీసం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా ఇవ్వకుండా తాము మాత్రం వేల కోట్లు దోచుకుంటూ, లాభసాటి వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటున్నారని జోరుగా జరుగుతున్న చర్చ
ఈ అసంతృప్తి ఎక్కడికి దారితీస్తుందో అని సర్వత్రా నెలకొన్న ఆసక్తి..