ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సందీప్ కుమార్ పర్యటన..

ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ సందీప్ కుమార్ పర్యటన..

ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డితో రెండు రోజుల పాటు భేటీ..

భేటీలో వెనక్కి తగ్గని అసమ్మతి ఎమ్మెల్యేలు..

నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయంటూ సందీప్‌కు వివరించిన రాజగోపాల్ రెడ్డి..

ఇద్దరు షాడో సీఎంలుగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని సందీప్‌కు రాజగోపాల్ రెడ్డి నివేదిక..

అధికార కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ బీఎం సందీప్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాత్రి వేర్వేరుగా భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణ, ఎమ్మెల్యేల అసంతృప్తి, బహిరంగ ప్రకటనల ప్రభావంపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం.

పార్టీ నేతలు బహిరంగంగా చేస్తున్న విమర్శలు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయని, ఇది పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తుందని ఇంచార్జ్ సందీప్ ఇరువురు ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఏవైనా ఇబ్బందులు లేదా అసంతృప్తులు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఒకవేళ అధిష్టానంతో మాట్లాడాలని భావించినా అందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, అవసరమైన ఏర్పాట్లు చేస్తానని సందీప్ హామీ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధించాలంటే నేతలంతా ఐక్యంగా పనిచేయాలని, బహిరంగ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఆయన గట్టిగా హితవు పలికారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నచ్చచెబుతూ, వచ్చే రోజుల్లో పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది….