కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..!

అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే: కవిత

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్కు MLC కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నయ్యా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!!’ అని ట్వీట్ చేస్తూ కేటీఆర్ను ట్యాగ్ చేశారు. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్కు లేఖ నేపథ్యంలో కేటీఆర్, కవిత మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగిన విషయం తెలిసిందే..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా న‌టుడు గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా కేటీఆర్‌కి బ‌ర్త్‌డే విషెస్ తెలిపాడు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రజాసేవలో మరెన్నో గొప్ప సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నానంటూ రామ్ చ‌ర‌ణ్ రాసుకోచ్చాడు..సినిమాల విష‌యానికి వ‌స్తే.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు..

నా ప్రియమైన అన్నయ్యకు...

నా ప్రియమైన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. మా చిన్ననాటి అల్లరి నుంచి మీ స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం వరకు పంచుకున్న ప్రతీక్షణం ఒక ప్రియమైన జ్ఞాపకం. మీ జ్ఞానం, మద్దతు నాకు ప్రపంచం. మీకు అపరమితమైన ఆరోగ్యం, ఆనందంతోపాటు నిరంతరం విజయం కలగాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని, గిఫ్ట్ ఏ స్మైల్ కొనసాగించడం హర్షణీయమని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ పంపించిన, కేసీఆర్ కిట్ల ను మహిళలకు అందజేశారు..పార్టీ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడారు. మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో ప్రతీ యేటా మాదిరిగానే సేవ కార్యక్రమాలు నిర్వహించడం సంతోష కరణమన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా 7 ఏళ్లుగా లక్షల మంది కి అండగా నిలిచారన్నారు. పుట్టిన రోజును ప్రజలు పండుగ లా జరుపుకుంటారన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలు దీవించాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ మండల అధ్యక్షుడు ఆంకారపు రవీందర్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి, వలకొండ వేణుగోపాల్ రావు, మిరాల భాస్కర్ యాదవ్, జక్కుల నాగరాజు యాదవ్, బండి జగన్, ఏసీ రెడ్డి రాంరెడ్డి, కందు కూరీ రామ గౌడ్, అనిల్ గౌడ్, గుండు ప్రేమ్ కుమార్, కొయ్యాడ రమేష్, అమర్ రావు, భానుమూర్తి, తిరుపతి, నవీన్ రావు, గనప శివాజ్యో తి, రోజా, మహిళలు ఉన్నారు.