ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు…
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 3,240 పంచాయతీలకు 74.45 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు…
ఏకగ్రీవాలు మినహా 3,240 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తొలివిడతలో 709 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో మెుత్తం 31,614 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలివిడత ఎన్నికల్లో 74.45 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటించనున్నారు…
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు..
ఉండవల్లిలోని MPU స్కూల్లో ఓటు చేసిన సీఎం చంద్రబాబు..
కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం..
భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి లోకేష్..