జిలాండ్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు విజయానికి బాటలు వేసుకుంది. మ్యాచ్‌లో రెండో రోజైన శనివారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9తో నిలవగా..ఆ జట్టు కేవలం 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో భారత్ ముందు 150 పరుగులకి ఆటు ఇటుగా లక్ష్యం నిలిచే అవకాశం ఉంది.
క్యారమ్ బాల్స్‌తో ప్లాన్
వాంఖడే టెస్టులో భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకిగా ఉన్న విల్ యంగ్ వికెట్ కోసం టీమిండియా సరికొత్త వ్యూహం రచించింది. తొలి ఇన్నింగ్స్‌లోనూ 138 బంతుల్లో 71 పరుగులు చేసిన విల్ యంగ్.. ఈరోజు రెండో ఇన్నింగ్స్‌లో కూడా 100 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేశాడు. దాంతో విల్ యంగ్ వికెట్ కోసం అశ్విన్ పదే పదే క్యారమ్ బాల్ని ప్రయోగిస్తూ ఇబ్బందిపెట్టగా.. భారత్ ఫీల్డర్లు కూడా ఔట్ కోసం అప్పీల్ చేస్తూ అతని ఏకాగ్రత్తని దెబ్బతీశారు.
ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన అశ్విన్.. ఓవర్లో ఏకంగా 3 క్యారమ్ బాల్స్ విసిరాడు. ఇందులో ఒక బంతిని డిఫెన్స్ కోసం విల్ యంగ్ ప్రయత్నించగా.. బంతి అతని బ్యాట్ పక్క నుంచి వెళ్లి కీపర్ రిషబ్ పంత్ చేతుల్లో పడింది. దాంతో క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
కావాలనే అప్పీల్
ఇదే ఓవర్లో మరో క్యారమ్ బంతిని లెగ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని అశ్విన్ విసిరగా.. ప్లిక్ చేసేందుకు విల్ యంగ్ ప్రయత్నించాడు. అయితే.. మళ్లీ బ్యాట్‌కి దొరకని బంతి థై ప్యాడ్‌ని తాకి గాల్లోకి లేవగా.. కీపర్ రిషబ్ పంత్ డైవ్ చేస్తూ అందుకోబోయాడు. కానీ.. అతని చేతుల్లో నుంచి బంతి బౌన్స్ అవగా.. పక్కనే ఉన్న సర్ఫరాజ్ ఖాన్ డైవ్ చేస్తూ పట్టాడు. దాంతో మరోసారి క్యాచ్ ఔట్ అవుట్ కోసం భారత్ అప్పీల్ చేసింది. ఈసారి కూడా ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ను తిరస్కరించాడు.
లాస్ట్‌కి అశ్విన్‌కే క్యాచ్
కానీ.. ఓవర్ చివరి బంతికి విల్ యంగ్ దొరికిపోయాడు. అశ్విన్ విసిరిన క్యారమ్ బాల్ని నేరుగా అశ్విన్‌కే సింపుల్‌గా క్యాచ్ ఇచ్చేశాడు. అప్పటికే వరుసగా రెండు క్యాచ్ ఔట్ అప్పీల్ళ్లతో విల్ యంగ్ ఏకాగ్రత దెబ్బతిన్నట్లు కనిపించింది. వాస్తవానికి ఈ రెండు సందర్భాల్లోనూ బంతి బ్యాట్‌కి తాకలేదని భారత్ ఫీల్డర్లకి తెలుసు. అందుకే.. డీఆర్ఎస్కి వెళ్లలేదు. కానీ.. విల్ యంగ్‌పై ఒత్తిడి పెంచడానికి అప్పీల్ చేశారు. మొత్తానికి ఆ ట్రిక్ ఫలించి భారత్‌కి వికెట్ దక్కింది..
న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు పడ్డాయి. ఈ క్రమంలోనే నాలుగో ఇన్నింగ్స్‌లో 150 ప్లస్ టార్గెట్ ఛేధించడం టీమిండియాకు సవాలే.
శుభ్‌మన్, పంత్ జోరు..
అంతకుముందు 86/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(146 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 90) తృటిలో శతకం చేజార్చుకోగా.. రిషభ్ పంత్(59 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్(5/103) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. మ్యాట్ హెన్రీ, గ్లేన్ ఫిలిప్స్, ఇష్ సోధీకి తలో వికెట్ దక్కింది. భారత్‌కు 28 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రిషభ్ పంత్, శుభ్‌మన్ నికలడగా ఆడటంతో టీమిండియా తొలి సెషన్లో ఒకే ఒక్క వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్‌కు ముందు పంత్ ఔటయ్యాడు.
సుందర్ పోరాటం..
రెండో సెషన్లో టీమిండియా వెను వెంటనే వికెట్లు కోల్పోయింది. జడేజా, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, అశ్విన్ త్వరగా ఔటయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ డకౌటవ్వడం టీమిండియా భారీ స్కోర్ అవకాశాలను అడ్డుకుంది. ఓవైపు వికెట్లు పడినా.. మరోవైపు సుందర్ దూకుడుగా ఆడాడు. అయితే మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు. ఆకాశ్ దీప్ రనౌటై డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు.
మలుపు తిప్పిన అశ్విన్..
28 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. భారత బౌలర్ల ధాటికి కివీస్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డారిల్ మిచెల్, విల్ యంగ్ ఆచితూచి ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. 50 పరుగుల భాగస్వామ్యంతో భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు.
ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అశ్విన్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. జడేజా బౌలింగ్‌లో డారిల్ మిచెల్ భారీ షాట్ ఆడగా.. అశ్విన్ వెనక్కి పరుగెత్తి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈ వికెట్ అనంతరం కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. మ్యాట్ హెన్రీ, ఆజాజ్ పటేల్ కాసేపు ఇబ్బంది పెట్టినా.. జడేజా విడదీసాడు. హెన్రీని ఔట్ చేయగానే అంపైర్లు రెండో రోజు ఆటను నిలిపేసారు. తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ 235 పరుగులు చేసిన విషయం తెలిసిందే..
వాంఖడేలో టాప్-5 సక్సెస్ ఫుల్ ఛేజింగ్‌లు
ఈ స్టేడియంలో టెస్టుల్లో అత్యధిక ఛేదన రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2000 ఫిబ్రవరిలో భారత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని 63 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
1980లో వాంఖడేలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌కు భారత్ 96 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ని ఇంగ్లిష్ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 29.3 ఓవర్లలో అందుకుంది.
2012 నవంబర్‌లో ఇదే స్టేడియంలో టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 58 పరుగుల టార్గెట్‌ని 58 బంతుల్లో ఛేజ్ చేసింది.
ఈ వేదికలో 1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. 48 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
2001 ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 47 పరుగుల టార్గెట్‌ని 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది.