Elon Musk’s భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించడంపై ఎలాన్ మస్క్‌కు, భారతీయ టెలికాం దిగ్గజాలకు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. స్టార్‌లింక్ లాంచ్ ఆలస్యం కావడంతో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్ గట్టిగానే బదులిచ్చారు. మస్క్ కంటే తాము ఎంతో ముందు నుంచే క్యూలో ఉన్నామని.. అయినప్పటికీ అనుమతుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని స్పష్టం చేశారు. బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడిన మిట్టల్.. తాము ఎలాంటి ప్రత్యేక రాయితీలు కోరడం లేదని, నిబంధనల ప్రకారమే ముందుకెళ్తున్నామని తేల్చిచెప్పారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి రిలయన్స్ ప్రయత్నిస్తోందని, స్టార్‌లింక్‌కు అనుమతులు రాకుండా అడ్డుపడుతోందని పరోక్షంగా ఆరోపించారు మస్క్. అయితే మస్క్ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం, టెలికాం శాఖ తీవ్రంగా ఖండించాయి. భారత్‌లో ఎలాంటి గుత్తాధిపత్యానికి తావులేదని, అన్ని కంపెనీలకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశాయి.స్టార్‌లింక్‌కు ఇప్పటికే జీఎంపీసీఎస్ లైసెన్స్ లభించినప్పటికీ.. కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించడానికి అవసరమైన సెక్యూరిటీ క్లియరెన్స్‌లు, స్పెక్ట్రమ్ కేటాయింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. సునీల్ మిట్టల్ సంస్థ ‘యూటెల్ శాట్ వన్‌వెబ్’.. రిలయన్స్ కి చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ కూడా ఈ రేసులో ఉన్నాయి. నిబంధనల ప్రకారమే స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుగుతాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే ప్రకటించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.