యాదగిరిగుట్ట
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
పూర్ణకుంభ స్వాగతం పలికి వేదాశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు…
స్వానసంకల్పం, దీపారాధన పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్ సూట్ లో వైటీడీఏ, ఆలయ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం.
స్వర్ణతాపడ పనుల పురోగతి, ఆలయ అభివృద్ధి, పెండింగ్ లో ఉన్న పనులు, చేపట్టాల్సిన పనులపై చర్చ.
యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్ కు స్వాగతం పలికిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి…
. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌రూమ్‌కి వెళ్లిన సీఎం, విష్ణు పుష్కరిణి వద్ద నమస్కారం చేసుకున్నారు. నీళ్లను తలపై చల్లుకుని, అక్కడ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్నారు…ముందుగా దర్శించుకున్నారు. దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత వలిగొండ మండలంలో మూసీ ప్రవహించే సంగెం బ్రిడ్జి వద్దకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగేస్వరుడిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి ధర్మారెడ్డిపల్లి కాల్వ వెంట సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేయనున్నారు. నాగిరెడ్డిపల్లి వద్ద మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి ప్రసగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా 2వేల మందితో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు..