ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత…!

తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శనివారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొనగా సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400కిపైగా సినిమాల్లో నటించారు ఢిల్లీ గణేశ్. ఆయన నటించిన చివరి చిత్రం భారతీయుడు 2. తెలుగులో జైత్రయాత్ర, నాయుడమ్మ, పున్నమినాగు తదితర హిట్ చిత్రాల్లో నటించారు..