డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు..!

*డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు*

మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు

‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు చేశారని ఫిర్యాదు

టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఐటీ చట్టం లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఇంతకీ రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయడానికి పెట్టడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే, ఇటీవల సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా.. సమాజం సిగ్గుపడే అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ పోలీసులు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురి పై కేసులు అరెస్టులు జరిగిన విషయం తెలిసింది.ప్రధానంగా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీపై నాయకులపై అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టులు చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే..ఇప్పటికే పలువురు వైసిపి నేతలు ఇతర ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు మండ‌లం పోలీస్ స్టేష‌న్‌లో ఐటీ చ‌ట్టం కింద వ‌ర్మపై కేసు న‌మోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా (vyuham movie) ప్రమోషన్లలో భాగంగా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌, నారా బ్రాహ్మాణిల‌ను వ్యక్తిత్వాన్ని కించపర్చేలా రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని ఆరోపించారు..