Fact Check: రూ. 500 నోట్లపై స్టార్ గుర్తు ఉంటే అవి ఒరిజినలా, నకిలీనా..!?

ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తు ఉంటోంది. 500 రూపాయలతో పాటు ఇతర డినామినేషన్ల నోట్లపై కుడివైపు కింది భాగంలో ముద్రించి ఉండే సిరీస్ నంబర్ల మధ్యలో ఈ స్టార్ గుర్తు కనిపిస్తోంది. అలాంటి నోట్లు- నకిలీవనే ప్రచారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై జోరుగా సాగుతోంది. దీనిపై ఆర్బీఐ గతంలోనే క్లారిటీ ఇచ్చింది..500 రూపాయల నోటుపై ఇప్పటికీ చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మార్కెట్‌లో ఫేక్ కరెన్సీ విసృతంగా సర్కులేట్ అవుతున్న నేపథ్యంలో.. స్టార్ గుర్తు ఉన్న 500 కరెన్సీ నోట్లను తీసుకునేందుకు కొందరు నిరాకరిస్తున్నారు. ఆ నోట్లు మార్కెట్‌లో చెల్లవంటూ.. సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు కనిపిస్తున్నారు. ఈ పుకార్లపై గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. స్టార్ గుర్తు ఉన్న 500 నోట్లు ఫేక్ కావని వెల్లడించింది. ప్రింటింగ్ లోపం ఉన్న నోట్ల ప్లేసులో వీటిని ముద్రించినట్లు RBI తెలిపింది. 1 నుంచి 100 వరకు ఉండే సీరియల్ నంబర్ నోట్లలో ప్రింటింగ్ ఇబ్బందులు తలెత్తితే.. ఉన్న వాటి ప్లేసులో ఈ స్టార్ గుర్తున్న నోట్లను ముద్రించినట్లు వెల్లడించింది. అంటే.. స్టార్ సింబల్ ఉంటే- ఆ నోట్ రీప్లేస్ చేసినట్టు లేదా రీప్రింట్ చేసినట్లుగా గుర్తించాలని RBI సూచించింది. 500 నోటుపై సీరియల్ నంబర్‌కి ముందు స్టార్ గుర్తు ఉన్నవి మార్కెట్‌లో బేషుగ్గా చలామణి అవుతాయని తెలిపింది. స్టార్ సింబల్ ఉంటే మరొక నోటు ప్లేసులో ఈ నోటు ముద్రించినట్లు అర్థమని తేల్చి చెప్పింది. స్టార్ గుర్తు ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమైనవేనని వివరించింది.

*(స్టార్ )గుర్తు ఉన్న 500 నోట్లు మార్కెట్‌లో చలామణిలోకి వచ్చాయి. అలాంటి నోటు ఇండస్‌ఇండ్ బ్యాంక్ నుండి తిరిగి వచ్చింది. ఇది నకిలీ నోటు.*

*ఈ రోజు కూడా ఒక కస్టమర్ నుండి 2-3 అటువంటి నోట్లను స్వీకరించారు, కానీ వెంటనే దానిని తిరిగి ఇచ్చారు. ఈ నోటు ఉదయం ఎవరో ఇచ్చారని కస్టమర్ కూడా చెప్పాడు.*

*మార్కెట్‌లో నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది.*

*జాగ్రత్త అందరిలో అవగాహన కల్పించడానికి ఈ వార్త అందరికి చేరేలా చూడగలరు..