తెలంగాణ ప్రభుత్వం పై సింగర్ దిల్జీజ్‌ దోసాంజ్‌ సెటైర్లు..

ఇతర దేశాల నుంచి భారత్‌కు వస్తే.. వాళ్లు ఏం చేసినా.. ఏం పాడినా అనుమతిస్తారు.. సొంత దేశం వాడు పాడితే మీకు నచ్చదు..!

ప్రముఖ నటుడు, పంజాబీ సింగర్ దిల్జీజ్‌ దోసాంజ్‌ (Diljit Dosanjh) కన్సర్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే..హైదరాబాద్‌లో శనివారం జరిగిన ‘దిల్ లుమినాటి’ కన్సర్ట్‌(‘Dil-Luminati’ Concert)లో మద్యం, డ్రగ్స్‌ లేదా హింసను ప్రోత్సహించడం పాటలు పాడొద్దని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిల్జీజ్ దోసాంజ్‌ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్టిస్టులు ఇతర దేశాల నుంచి భారత్‌కు వస్తే.. వాళ్లు ఏం చేసినా..
ఏం పాడినా అనుమతిస్తారు. ఎలాంటి టెన్షన్‌ ఉండదు. కానీ ఓ ఆర్టిస్టు మీ సొంత దేశం నుంచి పాడేందుకు వస్తే మాత్రం జనాలకు చాలా ఇబ్బందులు వస్తాయని సెటైర్లు వేశాడు. దిల్జీజ్‌చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/MirrorNow/status/1858054210945794258?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1858054210945794258%7Ctwgr%5E4d1c52f4991dface309ee7d11024fae99467f0c5%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F