చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు…

India vs Australia: ఆసీస్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా.

104 పరుగులకు ఆలౌట్. సత్తా చాటిన భారత్ బౌలర్..

20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ గడ్డపై 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న పెర్త్ టెస్టులో టీమిండియా (India vs Australia) ఆధిక్యం సాధించింది. భారత బౌలర్ల (Bowlers) విధ్వంసం ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ సత్తా విఫలమైంది..

టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ 229 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు. డౌన్‌అండర్‌లో తొలి వికెట్‌కు 100 పరుగుల మార్కును దాటిన ఆరో భారత జోడీగా వీరు రికార్డు సృష్టించారు..

పెర్త్ టెస్టులో భారత్ నుంచి అత్యంత విజయవంతమైన బౌలర్ గా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా నిలవడం విశేషం. ఈ మ్యాచులో బుమ్రా ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షిత్ రాణా 3, సిరాజ్ రెండు వికెట్లను తీశారు. దీంతో భారత బౌలర్ల విధ్వంసానికి ఆస్ట్రేలియా ఆటగాళ్లు మొత్తం 104 పరుగులు మాత్రమే చేయగలిగారు.

45 ఏళ్ల రికార్డు

ఈ క్రమంలో పెర్త్‌లో టీమ్ ఇండియా ఆధిక్యంలోకి వచ్చింది. కానీ 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టకుండా టీమిండియా నిలిచింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టుల్లో అత్యల్ప స్కోరుతో ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా 45 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొడుతుందని భావిచింది. కానీ సాధ్యం కాలేదు. చివరికి వచ్చిన ఆస్ట్రేలియా జోడీ పరుగులు తీసి ఆ రికార్డు సృష్టించకుండా అడ్డుకున్నారు..

అగ్రస్థానం దిశగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్..

ఈ జాబితాలో సునీల్ గవాస్కర్, క్రిష్ శ్రీకాంత్ 191 పరుగుల భాగస్వామ్యంతో అగ్రస్థానంలో ఉన్నారు. 1986లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈ దిగ్గజ ఓపెనింగ్ జోడీ ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత చౌహన్, సునీల్ గవాస్కర్ 165 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. 1981లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ మూడో ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించారు.

2003లో ఆకాశ్ చోప్రా వీరేంద్ర సెహ్వాగ్ .. మెల్‌బోర్న్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో 141 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 1948లో మన్కడ్, సర్వటే మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులు జోడించారు. 2004లో సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా 123 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు.

అయితే జైస్వాల్, కేఎల్ రాహుల్ 131 పరుగుల అజేయ భాగస్వామ్యంతో పాత రికార్డులను అధిగమించే దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు..

ఆస్ట్రేలియాలో 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం పూర్తి చేసిన భారత ఆటగాళ్లు..

సునీల్ గవాస్కర్/కె శ్రీకాంత్ – 191 సిడ్నీలో, 1986

సునీల్ గవాస్కర్/చేతన్ చౌహాన్ – 165 మెల్బోర్న్, 1981

ఆకాష్ చోప్రా/వీరేంద్ర సెహ్వాగ్ – 141 మెల్బోర్న్, 2003

వినూ మన్కడ్/చందు సర్వతే – 124 మెల్‌బోర్న్‌లో, 1948

ఆకాష్ చోప్రా/వీరేంద్ర సెహ్వాగ్ – 123 సిడ్నీలో, 2004

యశస్వి జైస్వాల్/కేఎల్ రాహుల్ – 100* పెర్త్‌లో, 2024.