లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*అత్యంత శక్తివంతమైన దేశాలలో భారత్ 4 వ స్థానం*

ప్రపంచంలోని 10 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది..

తర్వాతి స్థానాల్లో రష్యా,చైనా, భారత్ ఉన్నాయి..

ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు.కాంగ్రెస్ అధ్యక్షుడు
– శ్రీ మల్లికార్జున్ ఖర్గే.

ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలన్నారు.

‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించినట్లే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం.

మా పిల్లలను చంపుతారా, ఫుడ్ పాయిజన్ ఘటనపై ఓ తల్లి ఆవేదన

ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయింది.. మా పిల్లలను చంపుతారా

మక్తల్ – మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఓ తల్లి ఆవేదన

ఫుడ్ పాయిజన్ జరిగిందన్న విషయం తెలుసుకున్న ఓ విద్యార్దిని తల్లి తన కూతురు ఎలా ఉందో అంటూ మక్తల్ ప్రభుత్వాసుపత్రికి రోధిస్తూ వచ్చింది.

అప్పటికే తన బిడ్డను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పగా ఆ తల్లిని కూతురితో ఫోన్లో మాట్లాడించి హుటాహుటిన తల్లిదండ్రులను కూడా మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి పంపించారు.

ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే మీద నోరు జారిన సబ్ కలెక్టర్..!!

గురుకుల విద్యార్దిని శైలజ మృతదేహంతో దాబా గ్రామంలో ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబానికి నచ్చజెప్పే క్రమంలో ITDA ఇన్ఛార్జ్ PO, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మార్మాట్ నోరు జారారు.

“మీ అమ్మాయి మరణించింది. మీకే ఇబ్బంది అవుతుంది.. ఆమె (ఎమ్మెల్యే) వచ్చింది, మళ్లీ వెళ్లిపోతాది’ అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి స్పందించిన ఎమ్మెల్యే ఆయనపై ఫైర్ అయ్యారు..

వీహెచ్‌ ఇంటి దగ్గర కలకలం.. కారుపై రాళ్లు రువ్విన దుండగులు (వీడియో)

తెలంగాణ : కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటి దగ్గర రాళ్ల దాడి కలకలం రేపింది. హైదరాబాద్‌లోని డీడీ కాలనీలోని ఆయన ఇంటి ముందు పార్క్‌ చేసిన కారుపై రాళ్ల దాడి జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దాడి సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు..

ఎంఐఎం నేతల బెదిరింపులతో వెనక్కి తగ్గిన జీహెచ్ఏంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు

సీజ్ చేసిన 24 గంటల్లోనే తెరుచుకున్న చికెన్, మటన్ షాపులు

ఎంఐఎం నేతల బెదిరింపులపై మండిపడ్డ జీహెచ్ఏంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్ – పాతబస్తీ మోతీ మార్కెట్లో అపరిశుభ్రంగా, ఎలుకలు తిరుగుతున్న చికెన్ షాపును, 70 కిలోల చికెన్ ను సీజ్ చేసిన జీహెచ్ఏంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు.

విషయం తెలుసుకొని హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ రహమత్‌ బేగ్‌

షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులను బెదిరించిన ఎంఐఎం ఎమ్మెల్సీ.

దీంతో సీజ్ చేసిన 24 గంటల్లోనే షాపులను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.

దీనిపై మండిపడ్డ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. హైదరాబాద్ వాసులు కల్తీ ఆహారంతో ఇబ్బందులు పడొద్దు.

ఫుడ్ సేఫ్టీ అధికారులపై, ఎంఐఎం నేతల బెదిరింపులు సరైనవి కావంటూ మండిపడ్డ గద్వాల్ విజయలక్ష్మి…

ఈ నెల 30 నుంచి ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో బీజేపీ నిరసన

కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ నిరసనలు

ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని బీజేపీ నిరసన కార్యక్రమాలు

కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్‌తో బీజేపీ నిరసన

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది అవుతోంది. ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ విజయోత్సవాలకు బీజేపీ కౌంటర్‌గా ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని చెబుతూ ఈ తరహా నిరసనలకు సిద్ధమైంది.

ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఒక్కోరోజు ఒక్కో విధంగా నిరసన తెలపనుంది. ఈ నెల 30న కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్, డిసెంబర్ 1న జిల్లాస్థాయిలో బీజేపీ ఛార్జిషీట్, డిసెంబర్ 2, 3 తేదీల్లో నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. నిరసన చేపడుతున్న ఈ వారం రోజులు ప్రతిరోజు… ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల మందితో సభలు కూడా నిర్వహించనుంది…

రాహుల్ గాంధీకి బ్రిటన్ పౌరసత్వం… ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామన్న కేంద్రం

భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత పిటిషన్

స్పందన తెలియజేయాలని కేంద్రానికి అలహాబాద్ హైకోర్టు ఆదేశం

డిసెంబర్ 19వ తేదీ లోగా నిర్ణయించాలన్న హైకోర్టు

రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పౌరసత్వం అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, కాబట్టి ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది.

బీజేపీ నేత, న్యాయవాది విఘ్నేష్ శిశిర్ అలహాబాద్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఆయన పౌరసత్వం అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. దీనిపై స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 19వ తేదీ లోగా నిర్ణయించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

పిటిషనర్ శిశిర్ మాట్లాడుతూ… రాహుల్ గాంధీకి భారత్‌తో పాటు యూకేలో పౌరసత్వం ఉందనేందుకు ఆధారాలు లభించాయన్నారు. ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. భారత చట్టాల ప్రకారం ఒక పౌరుడికి భారత్‌తో పాటు మరో దేశంలో పౌరసత్వం ఉండకూడదని గుర్తు చేశారు. అలా ఉంటే ఒక దేశ పౌరసత్వం రద్దవుతుందన్నారు. ఈ క్రమంలో రాహుల్ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం రద్దు చేస్తుందని భావిస్తున్నామన్నారు..

దిలావర్‌పూర్‌లో రైతుల నిర్భందం నుంచి ఆర్డీవోను బయటకు తెచ్చిన పోలీసులు..!

దిలావర్‌పూర్‌లో రైతుల నిర్భందం నుంచి ఆర్డీవోను రక్షించిన పోలీసులు

నిర్మల్ – దిలావర్‌పూర్‌ మండల కేంద్రంలో నిర్బంధించిన ఆర్డీవో రత్న కళ్యాణిని తీసుకెళ్లేందుకు పోలీసు బలగాలు కారు వద్దకు చేరుకున్నాయి.

భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆర్డీవోను కాపాడిన పోలీసులు

కారు చుట్టూ ఉన్న మహిళలను నెట్టివేసి ఆమెను మహిళా పోలీసు బలగాలు అక్కడి నుంచి తప్పించాయి.

దీంతో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయినా బలగాలు ఆమెను అక్కడి నుంచి తప్పించాయి..

*ఇలాంటి భోజనం మీ పిల్లలకు పెడతారా : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి..!!*

రాయికల్: ‘ఉడకని అన్నం.. నీళ్లలాంటి పప్పు.. ఈ భోజనాన్ని పిల్లలు ఎలా తింటారు.. మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా..?’ అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

మంగళవారం రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గ్రామంలోని జ్యోతిబాపూలే బాయ్స్‌ స్కూల్‌ను జీవన్‌రెడ్డి సందర్శించారు. మొదటగా క్లాస్ రూముల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్య బోధన, గురుకులంలోని వసతులపై ఆరా తీశారు.

భోజనం బాగుండడం లేదని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకురాగా.. కిచెన్‌లోకి వెళ్లి పరిశీలించారు. ఆహారం పదార్థాలు క్వాలిటీగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే కలెక్టర్‌కు లెటర్ రాశారు. ఆయన వెంట లీడర్లు అత్తినేని గంగారెడ్డి, మహేందర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు…

నేడు ప్రధానమంత్రితో పవన్‌కల్యాణ్‌ భేటీ

నేడు ప్రధానమంత్రితో పవన్‌కల్యాణ్‌ భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగే ఈ భేటీలో ఆయన ప్రధానంగా జలజీవన్‌ మిషన్‌ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే కేంద్ర పర్యావరణ, అటవీశాఖమంత్రి భూపేందర్‌ యాదవ్‌తోనూ పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది..

మిషన్ శుక్రయాన్‌కు భారత్ సిద్ధం.

మిషన్ శుక్రయాన్‌కు భారత్ సిద్ధం
రోదసిలో భారత్ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి, శుక్రగ్రహానికి సంబంధించి వీనస్ ఆర్బిటర్ మిషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు ఇస్రో వెల్లడించింది. శుక్రయాన్ పార్టు1కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ISRO అహ్మదాబాద్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ తెలిపారు. VOM మిషన్‌ను 2028లో ప్రయోగిస్తామన్నారు. గ్రహాల్లో జరిగే మార్పులు, భవిష్యత్‌లో ఇతర గ్రహాల మిషన్లపై ప్రయోగాలకు VOM ఉపకరించనుంది..

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ న‌టుడు సుబ్బ‌రాజు.

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ న‌టుడు సుబ్బ‌రాజు
టాలీవుడ్ న‌టుడు పెనుమ‌త్స‌ సుబ్బ‌రాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశారు. పెళ్లి బట్టలు ధరించి, త‌న భార్య‌తో క‌లిసి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టా వేదిక‌గా ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నారు. ఇక ఈ విషయం తెలియ‌డంతో సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు, ఇత‌ర రంగాల‌కు చెందిన వారితో పాటు అభిమానులు కొత్త జంట‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. కానీ వధువుకు సంబంధించిన విషయాలను ఆయన తెలియజేయలేదు…

మహారాష్ట్రలోనూ ప్రతిపక్ష నేత హోదా లేనట్లే !

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోనూ ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చేలా ఫలితాలు ఎవరికీ రాలేదు. అక్కడ మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందులో పది శాతం అంటే కనీసం29 అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్న వారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వస్తుంది. బీజేపీ కూటమిలో ఉన్న బీజేపీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు అన్నింటికి అంత కంటే ఎక్కువే వచ్చాయి కానీ ఓడిపోయిన కూటమిలోని కాంగ్రెస్, శ్రరద్ పవార్, ఉద్దవ్ ధాక్రే పార్టీలకు కనీసం ఇరవై సీట్లు కూడా రాలేదు. అంటే ఎవరికీ ప్రతిపక్ష నేత హోదా లేనట్లే.

మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మూడు పార్టీలు కలిపి ఒకర్నే తమ నేతగా ఎన్నుకుంటే ప్రతిపక్ష నేత హోదా రావొచ్చు.కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎ పార్టీకి ఆ పార్టీ పక్ష నేత ఉంటారు. మూడు పార్టీల్లో శివసేన పెద్దపార్టీగా ఉంది. ఆ పార్టీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీప్రధాన ప్రతిపక్ష నేత హోదా మాత్రం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

దేశంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేని రాష్ట్రాలు ఆరు వరకూ ఉన్నాయి. ఏపీలో జగన్ రెడ్డి ప్రతిపక్షే నేతే కానీ అసెంబ్లీలో గుర్తింపునకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు లేరు. దాంతో ఆయన తనకు హోదా ఇవ్వాలని రచ్చ చేస్తున్నారు. గుజరాత్‌లోనూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు. అక్కడ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది కానీ.. కాంగ్రెస్‌కు 13 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు.

మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో అధికార కూటమి కాకుండా మరో పార్టీ పదిశాతం సీట్లు దక్కించుకోలేకపోయింది..

Ap

Kadapa

కడప ఎస్పీకి ఘాటుగా లేఖ వ్రాసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి..

ఆర్టీపీపీలో ఫ్లయాష్‌ తీసుకెళ్లేందుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వాహనాలను ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడుతున్నారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి వ్రాసిన లేఖలో ఆర్టీపీపీలో ఫ్లైయాష్‌ తీసుకెళ్లేందుకు మా వాహనాలను ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అయినా మేం సంయమనం పాటించాం..వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అందుకే వైఎస్సార్‌ జిల్లా నుంచి వచ్చే సిమెంట్, ఇసుక వాహనాలను మేమూ అడ్డుకున్నాం. మీరు కోరిన మీదట వాటిని నడవడానికి అనుమతించాం. మా వాహనాలను అడ్డుకోకూడదని మేం కోరాం..అయినా పరిస్థితి మారలేదు.

రేపు మేం ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నాం..వాళ్లు ఆపితే మేం అంత ఈజీగా తీసుకోం. ఇటీవల వారు అదానీ సంస్థపై కూడా ఎటాక్‌ చేశారు. మేం అలాంటి వాళ్లం కాదు. రేపు మా వాహనాలను అడ్డుకుంటే మాత్రం వారి వేదింపులను సహించేది లేదు. తప్పకుండా సరైన సమాధానం చెప్తాం అంటూ కడప ఎస్పీకి లేఖ వ్రాశారు.

తెలంగాణ రాష్ట్రం పంజా విసురుతున్న చలి..

తెలంగాణ రాష్ట్రం లో పెరుగుతున్న చలి తీవ్రత..

తెల్లవారు జామున, రాత్రి సమయంలో విపరీతంగా చలి తీవ్రత, చలిగాలులు

తెల్లవారుజామున పొగమంచు తో వాహనదారుల ఇక్కట్లు

ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక అవస్థలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

చాలా ప్రాంతాల్లో 15డిగ్రీల లోపే నమోదు..

ఆదిలాబాద్ 9.7 డిగ్రీలు,
మెదక్ 10.6 డిగ్రీలు
పఠాన్ చెరు 11.2 డిగ్రీలు
గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాజేంద్రనగర్ లో 12.5,
దుండిగల్ లో 13.2 డిగ్రీలు
గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ లో 14.8డిగ్రీలుగా మినిమమ్ టెంపరేచర్లు..

నెల్లూరు జిల్లా :

హిజ్రాల నాయకురాలు హాసిని దారుణ హత్య

కొడవలూరు మండలం టపాతోపు వద్ద కత్తులతో పొడిచిన దుండగులు

రెండు కార్లలో వచ్చి హాసినిపై దాడి, ఆస్పత్రికి తరలించే లోపు మృతి

పార్లపల్లిలోని ఓ గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా హాసినిపై అటాక్

తిరుపతి – నెల్లూరు జిల్లాలో హాసినికి పెద్ద సంఖ్యలో హిజ్రాల సపోర్ట్

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

దిలావర్‌పూర్‌లో రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

పోలీసు వాహనాలను అడ్డుకున్న గ్రామస్థులు

ఉదయం నుంచి నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్లపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.

ఇథనాల్ పరిశ్రమ తరలించేంతవరకు ఎన్ని అక్రమ అరెస్టులు జరిగినా భయపడేది లేదన్నారు..

*తుఫాన్ ఫెంగల్ ఇలా దూసుకొచ్చేస్తోంది.. 29న తీరం దాటుతుంది.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..!!*

బంగాళాఖాతంలోని వాయుగుండం తుఫాన్ గా మారుతుంది. 2024, నవంబర్ 27వ తేదీ సాయంత్రం అంటే.. బుధవారం సాయంత్రం 5 గంటలకు వాయుగుండం.. తుఫాన్ గా మారుతుంది.

ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న తుఫాన్ ఫెంగల్.. అత్యంత వేగంగా.. భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఈ తుఫాన్ తమిళనాడు రాష్ట్రంలో.. నవంబర్ 29వ తేదీన తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఏపీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.

నవంబర్ 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి.. తుఫాన్ ఫెంగల్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. నాగపట్నంకు 590 కిలోమీటర్ల దూరంలో.. పుదుచ్చేరికి 700 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై సిటీకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న ఇది.. 27వ తేదీ సాయంత్రానికి తుఫాన్ గా మారుతుంది. చెన్నై సిటీకి ఈ తుఫాన్ 800 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. మధ్యలో దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికి అయితే ఇది తమిళనాడు వైపు వస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. హై అలర్ట్ జారీ చేశారు.

తుఫాన్ ఫెంగల్ ప్రభావంతో నవంబర్ 30వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలు అయిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులు అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. కోతలు ఉంటే వెంటనే పనులు చేసుకోవాలని.. కల్లాల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

నవంబర్ 29వ తేదీ వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని మత్స్యకారులు.. సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తీరం వెంట 50 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.

తుఫాన్ ఫెంగల్ ప్రభావం తెలంగాణపై ఉండదని.. అక్కడక్కడ.. కొన్ని చోట్ల మోస్తరు వానలు పడే సూచనలు మాత్రమే ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది….

తమిళనాడులో భారీ వర్షాలు
కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లో భారీ వర్షాలు..

మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు..

నాగపట్నం జిల్లాలో నీటమునిగిన పలు ప్రాంతాలు..

తీవ్ర వాయుగుండం ప్రభావంతో..
మరో 48 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..

చెన్నైతో పాటు 12 తీరప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

మత్స్యకారులుసముద్రంలో వేటకు వెళ్లొద్దన్న అధికారులు
పుదుచ్చేరిలోని కారైకాల్‌లో రెడ్‌ అలర్ట్‌…

Google map

*గూగుల్ మ్యాప్స్పై కేసు*

తెలియని చోటు వెళ్లినప్పుడు చాలామంంది గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటారు..మ్యాప్ నావిగేషన్ ఫాలో అయి వెళుతుంటారు. అయితే గూగుల్ మ్యాప్ నమ్ముకొని తప్పుదారి పట్టడం, చేరాల్సిన చోటికి కాకుండా ఎక్కడికో వెళ్లడం, కొన్నిచోట్ల ప్రమాదాలు జరిగి ప్రాణాల మీదకు రావడం వంటి కాంప్లెయింట్స్ ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్ పై ఎక్కువయ్యాయి..ఇటువంటి కేసుల్లో గూగుల్ పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు..తాజాగా యూపీలో గూగుల్ మ్యాప్ నావిగేషన్ లో వెళ్లి ముగ్గురు మృతిచెందిన ఘటనలో మాత్రం పోలీసులు గూగుల్ అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

ఆదివారం యూపీలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే..గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు రామ్ గంగా నదిలో పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని గూగుల్ అధికారులతోపాటు మరో నలుగురు పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ అధికారులపై కేసులు నమోదు చేశారు.

గూగుల్ మ్యాప్ నావిగేషన్ లో గుడ్డిగా వెళ్లడంతో కారులో రామ్ గంగా నదిలోపడి ఫరుఖ్కాబాద్ జిల్లాకు చెందిన నితిన్, అజిత్ , అమిత్ అనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వీరిలో నితిన్, అజిత్ సోదరులు కాగా.. మరో వ్యక్తి అమిత్ మైన్ పురి జిల్లా కు చెందిన వ్యక్తి. నొయిడా నుంచి ఫరీద్ పూర్ కు ఓ పెళ్లికి వెళుతుండగా రాయబరేలీ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గూగుల్ మ్యాప్ రీజినల్ అధికారిపై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత శిక్షాస్మృతి సెక్షన్ 105 కింది కేసు నమోదు చేసినట్లు బూదాన్ జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు.

అయితే యూపీ ఘటనపై గూగుల్ మ్యాప్ అధికారులు స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తాం..భవిష్యత్తులో మేం కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు..

ఢిల్లీ:

ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారా – సుప్రీంకోర్టు

ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్ పెట్టాలన్న పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నందున భారత్ లోనూ ఈవీఎంల స్థానంలో బ్యాలట్ పేపర్‌ను పునఃప్రవేశపెట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.

ఓడిపోయినప్పుడు మాత్రమే నాయకులు ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతున్నారని.. గెలిచినప్పుడు ఎవ్వరూ ట్యాంపరింగ్ జరిగిందని మాట్లాడటంలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.

మనం మిగతా ప్రపంచానికి ఎందుకు భిన్నంగా ఉండకూడదు.. బ్యాలట్ పేపర్లో జరిగితే ఏంటి? ఈవీఎంలతో జరిగితే ఏంటి? మనం మళ్లీ బ్యాలట్ వైపు మళ్లితే అవినీతి పోతుందని ఎలా చెబుతారని ప్రశ్నించిన కోర్టు..

*High Court: మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..!!*

హైదరాబాద్: నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా?

అంటూ హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సీరియస్ అంశమని సీజే ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఫుడ్ పాయిజన్‌పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది.

ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు చనిపోతే కానీ స్పందించరా? అంటూ హైకోర్టు సీజే ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై వారంలోగా కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు సీజే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని సీజే ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అంటూ ఆగ్రహించారు.

నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో అధికారులు హాజరవుతారని చురకలు అంటించారు. అధికారులకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం చెప్పింది. భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తామని హైకోర్టుకు ఏఏజీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని హైకోర్టుకు చిక్కుడు ప్రభాకర్ తెలిపారు.