లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ..!

భారత్‌- రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించి త్వరలోనే కీలక ఒప్పందం..!

భారత్‌- రష్యా దేశాల మధ్య రైలు విడిభాగాల తయారీకి సంబంధించి త్వరలోనే కీలక ఒప్పందం కుదరనుంది. రష్యా తన దేశీయ అవసరాలు తీర్చుకోవడం కోసం భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని మంగళవారం రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. లోకోమోటివ్‌, రైలు విడిభాగాలు తయారు చేసే ప్రముఖ సంస్థ ట్రాన్స్‌మా్‌షహోల్డింగ్‌(టీఎంహెచ్‌) ఇందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. టీఎంహెచ్‌ సీఈవో కిరిల్‌ లిపా సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘భారత్‌లో ప్రస్తుతం వడ్డీ రేట్లు ఇతర దేశాల కంటే భిన్నంగా ఉన్నాయి. కాబట్టే మేము అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. భారత్‌లో తయారు చేసిన వాటిని రష్యన్‌ మార్కెట్‌కు సరాఫరా చేస్తాం. దీని ద్వారా భారత్‌లోని పలువురు సరాఫరాదారులకు మాకు మధ్య ఉన్న సుదీర్ఘకాలంగా సంబంధాలు మరింత మెరుగుపడటంతో పాటు రష్యాకు సైతం దిగుమతులు పెరుగుతాయ’’ని పేర్కొన్నారు..

దిల్లీలో ఈడీ అధికారులపై భౌతిక దాడి..!

Attack on ED officials | దిల్లీ: సోదాలకు వెళ్లిన ఈడీ (ED) అధికారులకు అనూహ్య ఘటన ఎదురైంది. కొందరు గుర్తుతెలియని దుండగులు అధికారులపై దాడులకు దిగారు..

ఈ ఘటన దిల్లీలోని బిజ్వాసన్‌ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈమేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈడీ (ED)లోని హై- ఇంటెన్సిటీ యూనిట్‌ (HIU) అధికారులు దేశవ్యాప్తంగా సైబర్‌క్రైమ్ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌ లక్ష్యంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో దిల్లీలో బిజ్వాసన్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో సోదాలు నిర్వహిస్తుండగా.. ఐదుగురు దుండగులు ఫర్నీచర్‌తో అధికారులపై భౌతిక దాడికి దిగారు. ఈ ఘటనలో ఈడీ అదనపు డైరెక్టర్‌కు గాయలయ్యాయి. దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు…క్యూఆర్‌ కోడ్‌, పిషింగ్‌, పార్ట్‌టైమ్‌ జాబ్స్ వంటి స్కామ్‌లతో సహా వేలాది సైబర్‌క్రైమ్‌ల నుంచి వచ్చిన అక్రమ నిధులను వెలికితీసేందుకు ఈ సోదాలు నిర్వహిస్తునట్లు ఈడీ అధికారులు తెలిపారు….

*ఫుడ్ పాయిజన్‌కు కారణం ఇదే..మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు*

ఇటీవల తెలంగాణలోని పలు గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మిల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా, ఈ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కుట్ర వెనక ఎవరున్నా వదలేది లేదని హెచ్చరించారు.

కేటీఆర్‌కు సవాల్..

ఈ క్రమంలోనే ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులేనని అన్నారు. దిలావార్ పూర్ వస్తే తప్పెవరిదో తేల్చుకుందాం అంటూ మంత్రి సీతక్క కేటీఆర్‌కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తమ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కుమారుడు తలసాని సాయి ఉన్నాడని తెలిపారు.

కంపెనీ రాసిస్తా..

కాగా, కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి తలసాని మండిపడ్డారు. తమపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ఆరోపణలు నిరూపిస్తే కంపెనీ రాసిస్తానని ఛాలెంజ్ చేశారు…

మోడీని చంపేస్తాం”.. ప్రధానిని బెదిరిస్తూ ఫోన్ కాల్...

పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొంది..పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి మహిళగా గుర్తించారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. ముంబై ట్రాఫిక్‌ పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు గురువారం ఉదయం ఓ బెదిరింపు కాల్‌ వచ్చింది. ఓ మహిళ మాట్లాడుతూ.. ప్రధాని మోడీని హతమార్చేందుకు ప్లాన్‌ చేసినట్లు తెలిపింది. ఈ హత్య కోసం ప్రత్యేకంగా ఓ ఆయుధాన్ని కూడా సిద్ధం చేసినట్లు బెదిరించింది. ఈ కాల్ తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఫోన్ చేసిన మహిళ మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
గత ఏడాది జులైలో కూడా ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది. అందులో ప్రధాని మోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని చంపేస్తామని హెచ్చరించారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ప్రధానిని, యూపీ సీఎంను చంపేస్తానని బెదిరించాడు. కాల్ చేసిన వ్యక్తి దేశంలో “26/11 తరహా దాడి” చేస్తామని బెదిరించినట్లు కూడా నివేదించబడింది.

కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్..!

దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు..అలాగే, దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడుతూ..’ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబందం ఉందని పీసీసీ అధ్యక్షుడు, మంత్రి సీతక్క ఆరోపణలు చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దు అని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గా నా కుమారుడు రాజీనామా చేశాడు.

ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే కంపెనీని రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావర్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు..

కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) స్వయంగా కారు నడుపుతూ కనిపించారు. గత కొన్ని నెలలుగా కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు..తనను కలవాలనుకునే పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మద్దతుదారులను చర్చల కోసం ఫాంహౌస్‌కు ఆహ్వానించారు.
ఇటీవల, కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలిన బీఆర్‌ఎస్‌ పార్టీ స్తబ్దుగా ఉంది.అయితే, ఇటీవలి పరిణామాలు కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలకు దారితీశాయి. ఈ వీడియో బీఆర్ఎస్ మద్దతుదారులలో మరింత ఉత్సాహాన్ని నింపింది…

రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసులు కొట్టివేత బెయిల్..!

చద్రబాబునాయుడు(chandrababu naidu)పవన్ కళ్యాణ్(pawan kalyan)లోకేష్(lokesh)పై గత ఎన్నికల ముందు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)వివాదాస్పద ట్వీట్ లు చెయ్యడంతో పాటుగా ఆ ముగ్గురి ఫోటోలని మార్ఫింగ్ కూడా చెయ్యడంతో కొంత మంది అభిమానులు ఆంధ్ర ప్రదేశ్ లోని ఒంగోలు తో సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్మ పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఈ కేసులో వర్మ గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్నాడు..ఈ నేపథ్యంలో వర్మ ఈ రోజు ఏపి హైకోర్టులో పిటిషన్ వేసాడు.సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై అనేక కేసులు నమోదు చేస్తున్నారు.చట్ట విరుద్ధంగా ఒక విషయంపై ఇన్ని కేసులుపెట్టడం సమంజసం కాదని పిటిషన్లో పేర్కొంటూ తనపై నమోదయిన కేసుల్ని క్యాష్ చెయ్యాలని కోరాడు.వర్మ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కూడా అప్ప్లై చేసాడు. దీంతో ఈ రోజు రాబోయే కోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠత నెలకొని ఉంది. ఇక అజ్ఞాతంలో ఉన్న వర్మ రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ పోలీసులకి సవాలు విసురుతున్నాడు.ఒక ఫేమస్ సినిమా యాక్టర్ వర్మ కి షెల్టర్ ఇచ్చాడనే వార్తలువస్తున్నాయి.మరోవైపు పోలీసులు మాత్రం వర్మ ఆచూకీ కోసం హైదరాబాద్, చెన్నై లో గాలింపు చేపడుతున్నారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు. అడ్డు తెరలు లేని ఆత్మీయతకు చిరునామాగా కేసీఆర్‌…శ్రీనివాస్‌ రెడ్డి..

వెన్నంటి ఉంటూ.. తన కష్టకాలంలో.. ఆనంద సమయాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు భావోద్వేగ వీడ్కోలు పలికారు..పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ ఇన్‌చార్జ్‌గా దాదాపు 20 ఏళ్ల పాటు సేవలు అందించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అమెరికాకు వెళ్లిపోతున్నారు. కుటుంబంతో అక్కడే స్థిర నివసించేందుకు వెళ్తుండడంతో కేసీఆర్‌ అతడికి ఆత్మీయంగా బంగారు గొలుసు.. పట్టువస్త్రాలు సమర్పించి సాగనంపారు..బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణవాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కుటుంబంతో సహా కలిశారు. తన సతీమణి శోభతో కలిసి శ్రీనివాస రెడ్డి కుటుంబంతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆత్మీయంగా తన నివాసంలోకి స్వాగతం పలికి ప్రత్యేకంగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ బంగారు గొలుసును శ్రీనివాస్‌ రెడ్డికి కానుకగా అందించారు. అనంతరం పట్టువస్త్రాలు అందించి.. వారి పిల్లలకు కానుకలు బహూకరించారు. సంప్రదాయబద్దంగా శ్రీనివాస్‌ రెడ్డికి వీడ్కోలు పలికారు. అనంతరం దగ్గరుండి కారు వద్దకు వెళ్లి మరి కేసీఆర్‌ దంపతులు వీడ్కోలు పలికారు..ఈ సందర్భంగా తెలంగాణ వాది, ప్రొఫెసర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌తో తన అనుబంధాన్ని వివరించారు. ‘నాకు జరిగిన సత్కారమే కాదు.. నాలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారం’ అని తెలిపారు. తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఉద్యమ రథ సారథి.. తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్‌ వద్ద 25 ఏళ్ల పాటు పనిచేయడం తన అదృష్టమని.. తనకు దక్కిన గొప్ప అవకాశమని చెప్పారు.

‘కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం రాకపోయేది. తెలంగాణ కోసమే కేసీఆర్ జీవితం అర్పితం చేశారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతం. ప్రేమతో మీ కేసీఆర్.. (విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్) అని నాకు వేసిన లాకెట్. నాలాంటి తెలంగాణ వాదులందరికీ వేసిందిగా భావిస్తున్నా’ అని మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన తనకు అమెరికా వెళ్లిపోవడం తప్పనిసరిగా మారిందని పేర్కొన్నారు.

‘తెలంగాణ గడ్డను వదిలి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ తప్పని పరిస్థితి. తెలంగాణ వాదులందరి తరఫున కేసీఆర్‌కు ధన్యవాదాలు. అడ్డు తెరలు లేని ఆత్మీయతకు చిరునామాగా కేసీఆర్‌ నిలిచారు. హోదాతో సంబంధం లేని.. ఆత్మగల మనుషుల అనురాగ బంధం కేసీఆర్. తెలంగాణ మట్టి ఆత్మీయతకు నిలువుటద్దం కేసీఆర్. తెలంగాణ వాదికి ఘన సత్కారంతో మరోసారి రుజువైంది’ అని శ్రీనివాస్‌ రెడ్డి వివరించారు..

ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు..క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు..!

వెటరన్ పేసర్ సిద్దార్థ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సిద్దార్డ్ కౌల్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో అమ్ముడుపోని తర్వాత కౌల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం…రూ.40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని కౌల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత క్రికెట్ తరపున ఆడేందుకు అవకాశమిచ్చిన బీసీసీఐకి, తను ప్రాతినిథ్యం వహించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సిద్దార్ద్ ధన్యవాదాలు తెలిపాడు.

ఐర్లాండ్‌పై అరంగేట్రం..
కాగా పంజాబ్‌కు చెందిన సిద్దార్థ్ కౌల్ 2018లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఇంగ్లండ్‌పై వన్డే డెబ్యూ చేశాడు. కౌల్ చివరగా టీమిండియా తరపున 2019లో ఆడాడు.

భారత్ తరపున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడిన కౌల్‌.. 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్‌హెచ్ జట్లకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 55 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పంజాబీ పేసర్‌.. 29.98 సగటుతో 58 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.