సూర్యాపేట జిల్లా..
హుజూర్ నగర్ …
డిగ్రీ, ఇంటర్ కాలేజీలలో, టాపర్ విద్యార్దులకు. నేను స్వయంగా గోల్డ్ మెడల్ అందిస్త.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

R9TELUGUNEWS.COM.
హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్, జిల్లా ఎస్పీ, తదితరులు, అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి ఉత్తమ్..
*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మాట్లడుతూ….
కాలేజ్ ఎర్పాటు చేసిందీ. మేమే.పది సంవత్సరాల పాటు ఏమి అభివృధి చెందలేదు..మళ్లీ నేనే కాలేజీ అభివృద్దికి పాటుపడుతున్న…పేద కుటుంబాలలో వుంటు , ఎంతో గొప్ప చదువులు చదవడానికి, ప్రభుత్వ కాలేజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి.కాలేజీకి అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తాం..ఇంకా కాలేజీకి ఏమేమి కావాలో, అవి ఎర్పాటు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం…కాలేజీ అధ్యాపఖులు కూడా అడ్మిషన్స్ పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోనీ,మెరుగైన విద్యను అందించాలి.
సమాజంలోనే గొప్ప వృత్తి అధ్యాపక వృత్తి,దీన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా భావించాలి.
హుజూర్ నగర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలి..ఇంటర్, డిగ్రీ కాలేజీలో అత్యధిక టెక్నాలాజీతో ల్యాబ్లే ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుంది..నిరుపేదల పిల్లలు ప్రభుత్వ కాలేజీలకి వస్తుంటారు. కాబట్టి వారికి నాణ్యమైన విద్యను అందించాలి..ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలు ఉండాలి..ప్రతి విద్యార్థి కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలి…డిగ్రీ, ఇంటర్ కాలేజీలలో, కాలేజీ టాపర్ కి విద్యార్దులకు, తాను సొంతగా గొల్డ్ మెడల్ అందించటం జరుగుతుందన్నారు.
లక్ష బిల్వర్చన పూజా..
హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో నేడు సహస్ర లింగార్చన, లక్ష బిల్వార్చన పూజ అత్యంత వైభవముగా జరిగినది. ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు..
జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

R9TELUGUNEWS.COM
శుక్రవారం నాడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ ఆకస్మికంగా హుజూర్నగర్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సందర్శించారు .ఈ యొక్క ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పదవ తరగతి విద్యార్థులను తరగతి గదిలో భౌతిక శాస్త్రం పై ప్రశ్నలను వేస్తూ సమాధానాలు రాబట్టారు .పిల్లలు చక్కటి సమాధానాలు ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం మధ్యాహ్న భోజన ఉపయోగించే బియ్యం మరియు వంట సామాగ్రిని వన్డే అటువంటి కూరగాయలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద ఉపాధ్యాఇనులు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చివేయడం కోసం కలెక్టర్ కి తెలియపరిచారు. తప్పనిసరిగా అట్టి శిథిలావస్థ లో ఉన్న భవనాన్ని త్వరలో కూల్చివేయడానికి అనుమతి ఇస్తానన్నారు.పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు..
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్(IAL) హుజూర్నగర్ కమిటీ ఎన్నిక..
R9TELUGUNEWS.COM
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) హుజూర్నగర్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా సాముల రామి రెడ్డి,అధ్యక్షులుగా మామిడి వెంకయ్య ఉపాధ్యక్షులుగా చక్రాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా చెనగాని యాదగిరి, సహాయ కార్యదర్శిగా సైదా హుస్సేన్, కోశాధికారిగా ధూళిపాల శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులుగా నట్టే సత్యనారాయణ, కమిటీ సభ్యులుగా చక్రాల వెంకటేశ్వర్, కొట్టు సురేష్, రామినేని వెంకటేష్, ఆర్ రమణారెడ్డి, గొల్ల గోపు నవీన్, పచ్చిపాల గురుమూర్తిగారు, భానోతు శ్రీను, గొట్టే ప్రశాంత్, బుడిగ నరేష్, ఎస్.కె నాగ పాష ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు మామిడి వెంకయ్య మాట్లాడుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర ద్వితీయ మహాసభ 2024 నవంబర్ 30 , మరియు డిసెంబర్ 1వ తేదీన హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సెమినార్, ప్రతినిధుల సభ ఉంటుందని ఈ మహాసభలో న్యాయవాదులకు సంబంధించిన అంశాలు, డిమాండ్లు సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకొని వాటి పై సమస్యల సాధన కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (IAL) తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన న్యాయవాదులకు విజ్ఞప్తి చేశారు…
*డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరణ..
R9TELUGUNEWS.COM
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ లక్ష్మల్ల నరసింహారావు మోర్య గారు మరియు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నియోజకవర్గ కన్వీనర్ దగ్గుపాటి బాబురావు గారు అధ్యక్షతన హుజూర్నగర్ మండలం మాధవరాయనిగూడెం గ్రామంలో డిసెంబర్ 1న జరిగే మాలల సింహగర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దమాల చప్పిడి సైదులు మాట్లాడుతూ మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని గ్రామంలో ఉన్నటువంటి మాలలను చైతన్య పరచడం జరిగింది మాలలంతా ఏకమై మరొక ఉద్యమానికి నాంది పలకాలని ఈ వర్గీకరణ వలన రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఎస్సి కులాలకు తీరని అన్యాయం జరుగుతుంది మాల జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవాలని వర్గీకరణ కారకులకు బుద్ధి చెప్పాలని మాలలు ప్రతి ఒక్కరు గ్రామం నుంచి సింహగర్జనకు తరలిరావాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ పెద్ద మాల చప్పిడి రోశయ్య దార్ల వెంకట్ చప్పిడి రామారావు లక్ష్మల్ల రాములు లక్ష్మణ రమేష్ కోలపూడి మనోహర్ దార్ల పెద్ద వీరస్వామి దార్ల చిన్న వీరస్వామి చెవుల నాగరాజు చప్పిడి నరసింహారావు చప్పిడి రాముడు చప్పిడి శ్రవణ్ లక్ష్మల్ల సాయికుమార్ దార్ల సాయి లక్ష్మల్ల జస్వంత్ కాష్మోళ్ల గోవర్ధన్ చెవుల చెన్నమ్మ చప్పిడి నరసమ్మ లక్ష్మణ్ కిట్టమ్మ దార్ల వెంకట నరసమ్మ చప్పిడి సోమమ్మ చేపూరి సుశీల బత్తుల పద్మ లక్ష్మణ సూర్య కళ చప్పిడి నాగమణి దార్ల విజయ చప్పిడి మల్లమ్మ రాధ కోళ్ల పూడి అరుణ కోళ్ల పూడి ప్రియాంక బొనిగల భారతి బైరుమల సౌజన్య లక్ష్మణ శృతి పాల్గొన్నారు..
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి… .జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్....

R9TELUGUNEWS.COM.
పదవ తరగతిలో విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయుల కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఈరోజు హుజూర్నగర్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం క్లాసులోకి వెళ్లి హాజరు రిజిస్టర్ పరిశీలించి విద్యార్థుల కనీసం సామర్థ్యాలను పరిశీలించారు ఫిజిక్స్ నందు విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. రాబోవు పదవ తరగతి వార్షిక పరీక్షల నందు ప్రతి విద్యార్థి డిస్టిక్షన్ తో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక క్లాసులు తీసుకోవాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని అన్నారు. తదుపరి కలెక్టర్ వంటగదిని పరిశీలించి వంటగది ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలని వంట పాత్రను డిటర్జెంట్ తో శుభ్రంగా చేసుకోవాలని వంట తయారు చేయు మహిళలు చేతులను శుభ్రంగా కడుక్కొని వంట చేయాలని, వంట చేయుటకు పరిశుభ్రమైన నీటిని వాడాలని, బియ్యంలో పురుగులు ఉన్నాయో లేవో పరిశీలించిన తదుపరి మాత్రమే వంటకు ఉపయోగించాలని, బియ్యాన్ని ఎల్లప్పుడూ వెలుతురు తగిలే విధంగా నిలువ చేసుకోవాలని సూచించి బియ్యాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు..
దీక్ష దివాస్ కార్యక్రమానికి తరలిన శ్రేణులు శ్రేణులు..!

R9TELUGUNEWS.COM.
హుజూర్నగర్ నుండి సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన నవంబర్ 29 “దీక్షా దివస్” కార్యక్రమంలో పాల్గొని, బిఆర్ఎస్ శ్రేణులని ఉద్దేశించి ప్రసంగించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లడుతూ..నాడు సరిగ్గా పదిహేనేండ్ల కింద కరీంనగర్ వేదికగా *”కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో”* అని నినదించి అల్గునూరు చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి బయల్దేరిన ఉద్యమ వీరుడు కేసీఆర్ అని అన్నారు..
.. కెసిఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలని ఎంతో ఇబ్బందిగా గురిచేస్తుందని అన్నారు.. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. హుజూర్నగర్ మాజీ జెడ్పిటిసి ఉప్పల సైదిరెడ్డి.. కౌన్సిలర్ జక్కుల నాగేశ్వరరావు. పట్టణ కార్యదర్శి అమర్ గౌడ్. బిఆర్ఎస్ నాయకులు రాంబాబు, నగేష్ రాథోడ్ ,, నగేష్.. బిక్షం.. . తదితరులు తరలి వెళ్లడం జరిగింది..
రైతు పండుగ సంబరాలను విజయవంతం చేయాలి..!
R9TELUGUNEWS. COM.
రేపు శనివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగ సంబరాలు.
జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం హుజూర్ నగర్ మండల కేంద్రంలోని రామస్వామి గట్టు వద్ద గల రైతు వేదిక లో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి గ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. అందుకే రైతులందరూ హుజూర్ నగర్ రైతు వేదికలో జరిగే ఈ కార్యక్రమం లో పాల్గొనాలని వ్యవసాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేశారు..