వ్యాపారులపైకి దూసుకెళ్లిన్న లారీ ..నలుగురు దుర్మరణం..!

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సాన్ని సృష్టించిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్- బీజాపూర్ రహదారి వద్ద 50 మంది కూరగాయలను అమ్ముతుండగా ఈ క్రమంలో ఒక్కసారిగా అటువైపుగా వస్తున్న లారీ వారిపైకి దూసుకెళ్లింది. దూసుకువస్తున్న లారీని చూసిన వ్యాపారులు అప్రమత్తమై భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిపోగా డ్రైవర్ మాత్రం క్యాబిన్లోనే ఇరుక్కుపోయాడు. లారీ బలంగా ఢీకొట్టడం వల్ల ఆ చెట్టు నేలకూలింది..ఈ ఘటనతో ఒక్కసారిగా హైదరాబాద్‌- బీజాపుర్‌ రహదారిపై భీతావహ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ నుంచి వెళ్తున్న ఈ లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్‌ (ఆలూరు), సుజాత (ఖానాపూర్‌)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు..