*సూర్యాపేట జిల్లా* …..
*మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్*
*ఎన్ని అవకాశాలు ఇచ్చినా, నిరంతరం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆయన..*
*ఆవులని పొట్టన పెట్టుకున్నడే అపవాదు ఎస్ఐపై..*
*అక్రమంగా రేషన్ బియ్యాన్ని బంధువుల ద్వారా అమ్మకం అనే అభియోగం..!*
*దళిత పిటిషనర్ పై అహంకార పూరిత మాటలు..*
*ఇలా ఎన్నో వివాదాల్లో తల దూర్చిన .. చివరికి కారు విషయంలో అడ్డంగా బుక్ అయిపోయిన ఎస్సై..*
పలు అవినీతి ఆరోపణల నేపథ్యంతో జిల్లాలోని మరంపల్లి ఎస్సై రామాంజనేయులును విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ మల్టీ జోన్-2 ఐజీ సత్య నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు…
*తెలిసిన వివ రాల ప్రకారం* ..
మట్టపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల ఎస్సై రామాంజనేయులు ఆ వ్యక్తికి చెందిన కారు మట్టపల్లిలోనే ఉండటంతో తన సొంత అవసరాల కోసం వినియోగించుకొని తిరిగి ఇస్తానని తీసుకున్నారు.
వారం రోజులు గడుస్తున్నా కారును తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితుడు
ఈ విషయమై డీజీపీతోపాటు జిల్లా ఎస్పీకి ఈ- మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు.
ఎస్సైపై విచారణకు ఆదేశించిన అధికారులకు ఈ ఘటనతోపాటు పలు అవినీతి ఆరోపణలు వెలుగు చూసినట్లు సమాచారం.
దీంతో ఎస్సై రామాంజనేయు లును విదుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం……
గతంలో సూర్యాపేట జిల్లా అనంతగిరి, నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ సస్పెండ్ గురి అయ్యారు ..అప్పుడు కూడా అవినీతి ఆరోపణలు వల్ల సస్పెండ్ అయ్యారు..
స్థానికంగా ఎస్ఐపై పలు ఆరోపణలు ఉన్నాయి.. ఇటీవల ఆవులు చనిపోయిన ఘటనలో డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు,,పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో బంధువులకి సహకరించారని ఆరోపణలు…పోలీస్ స్టేషన్లో ప్రతి కేసుకి ఉంటుందనే పద్ధతిలో వ్యవహరించే వారిని.. దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు కూడా ఇటీవల కాలంలో ఎస్సై పై ఎక్కువయ్యాయి…