నేటి పంచాంగం…నేటి మాట..!

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 05 – 12 – 2024,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,

తిథి : చవితి ఉ11.49 వరకు,
నక్షత్రం : ఉత్తరాషాఢ సా5.09 వరకు,
యోగం : వృద్ధి మ12.58 వరకు,
కరణం : భద్ర ఉ11.49 వరకు,
తదుపరి బవ రా11.18 వరకు,

వర్జ్యం : రా9.04 – 10.38,
దుర్ముహూర్తము : ఉ10.00 – 10.44,
మరల మ2.24 – 3.08,
అమృతకాలం : ఉ10.46 – 12.22,
రాహుకాలం : మ1.30 – 3.00,
యమగండం : ఉ6.00 – 7.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.20,
సూర్యాస్తమయం: 5.21,

*_నేటి మాట_*

*ప్రేమ అనగా!!…*
*ప్రేమ అనగా నేమి?? – అవి ఎన్ని రకాలు ??? – వాటి గుణగణాలు ఏమిటి ??? ఒకసారి వివరంగా తెలుసుకుందాము!!*
_మానవ జన్మ తరించడానికి ఎలాంటి ప్రేమ అవసరం??_

లోకములో మూడు రకములైన ప్రేమ లున్నవి!!…

*మొదటిది స్వార్థ ప్రేమ*
పరుల సుఖములను యోచింపక, వారి దుఃఖ మును గమనింపక, స్వార్థ ముగానే ఉండుట.

ఇది రూములో వేసిన బల్బు లాంటిది, దాని వెలుతురు ఆ రూములోనుండు వారికే తప్ప మరొకరికి, దానివలన ప్రయోజన ముండదు.

*రెండవది అన్యోన్య ప్రేమ*
తన అనుకూలములను సాధించుటకొరకు, తన్ను ప్రేమించు వారినిమాత్రం ప్రేమించుట, తనవారిని మాత్రం ప్రేమతో పలక రించుటయే ఈ ప్రేమ యొక్క గొప్పతనం,

ఇది వెన్నెల వంటిది, సర్వత్రా ఉండును గానీ, అంత ప్రకాశవంతముగా ఉండదు, ఏదీ స్పష్టంగా కనిపించదు.

*ఇక మూడవది సమర్ధ ప్రేమ!!..*
సర్వులనూ ఈశ్వర స్వరూపముగా భావించి, ఆనంద పడుట, ఇదే ఉత్తమ మార్గము.
ఇట్టి తలంపులతోటే మన జీవితమును సార్థకం చేసుకోవాలి, ఇదియే మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి, భగవంతున్ని చేరుకోవడానికి ద్రోవ…

*_🏵️శుభమస్తు🏵️_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏