ఎస్ఐ హరీష్ సూసైడ్ కేసులో యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ములుగు జిల్లా వాజే డు ఎస్సై రుద్రారపు హరీశ్ (29) ఆత్మహత్య ఘటన నిగ్గు తేల్చేందకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయని సమాచారం. ముళ్లకట్ట అంతర్రాష్ట్ర వంతెన పక్కనే ఉన్న ప్రైవేట్ రిసార్టులో ఎస్సై హరీశ్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గదిలో ఓ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రక్తపు మడుగులో విగతజీవి గా ఉన్న హరీశ్ మృతదేహంపై ఓ యువతి పడి రోదించిన ఫొటో లు, వీడియోలు వైరల్ అయ్యాయి..
ఈ క్రమంలో పలు విస్తుపోయే విషయాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ యువతి సూర్యాపేట జిల్లా వాస్తవ్యురాలిగా గుర్తించారు. అక్కడి పోలీసులను సంప్రదించగా సదరు యువతి గతంలో ముగ్గురు యువకులకు ప్రేమపేరుతో దగ్గరై పెళ్లికి ఒత్తిడి చేసి వారు ఒప్పుకోకపోవడంతో కేసులు పెట్టించినట్లు తేలింది. ఈమె వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైనట్లు సమాచారం…
ఏడు నెలల కిందట హరీష్కు ఓ యువతి ఫోన్ చేయగా.. మాటామాటా కలవడంతో ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకున్న ఇద్దరు..
హైదరాబాద్లో చదువుతూ వారంలో రెండు రోజులు వాజేడుకు వచ్చి వెళ్లేదని సమాచారం..
ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం..
యువతి గురించి ఆరా తీయగా.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన యువతి ఊళ్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని తెలిసింది..
అందులో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..
దీంతో హరీశ్ ఆమెతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం…
సెటిల్మెంట్ చేసుకోవడానికి హరీష్ ప్రయత్నించగా.. యువతి విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననడంతో మనస్థాపంతో హరీష్ ఆత్మహత్య..
తమ కుమారుడి మృతికి ఆ యువతే కారణమంటూ హరీష్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..