*కాంగ్రెస్ పార్టీ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన ఒంటెద్దు నరసింహ రెడ్డి_l.. ..
కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు… నిలదీస్తే అరెస్టులు.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు..
*పచ్చటి పల్లెల్లో రాజకీయ రంగు పూలుముకుంటూ హత్యలా..?*
*పాచ్య హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి..*
*నియోజకవర్గ వ్యాప్తంగా రెడ్ బుక్ ప్రారంభించడం జరుగుతుంది.. మిత్తికి మిత్తి చెల్లించడం జరుగుతుంది..*
*సూర్యాపేట జిల్లా..*
మఠంపల్లి మండల కేంద్రంలో. ఇటీవల బిఆర్ఎస్ నాయకుడు మన్యం శ్రీనివాస్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆక్రమ అరెస్టు కావడం, తో, .. బెయిల్ పై రిలీజ్ కావడంతో వారిని పరామర్శించిన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి….
అనంతరం కామాక్షి కుంట తండా బక్కలచ్యా తండా లొ brs పార్టీ సభ్యత్వ భీమా చెక్కును అందించటం జరిగింది…
మఠంపల్లి మండలం భీమ్లా తండా కు చెందినా పాచ్య హత్యను… నిరసిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ హత్యగానే భావించాలని..
నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తూ… అక్రమ కేసులు నమోదు చేస్తూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని అన్నారు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల ప్రజలు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు నిర్వహిస్తున్నారు.. అవేవీ వీళ్ళకి కనిపించడం లేదు.. ప్రశ్నిస్తే కేసులు.. అడిగితే అరెస్టులు.. ఇది కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాలు..
సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను నమ్ముకోలేదు,, పోలీసులనే నమ్ముకున్నాడు.. అందుకే స్వేచ్ఛగా ప్రజల మధ్యలో తిరగలేకపోతున్నారు…
గతంలొ సీఎం కేసీఆర్ పదేళ్లపాటు పరిపాలించినప్పుడు ఎక్కడా కూడా హత్యా రాజకీయాలు చేయలేదు…
పరిపాలన చేతకాక, అమాయక కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, అది చాలాదన్నట్టుగా హత్యలకు గురి చేస్తున్నారు…
కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలనకు ప్రజలందరూ త్వరలోనే పాడె కడతారని అన్నారు..
హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా.. అడ్డు అదుపు లేకుండా అక్రమంగా ఇసుక,, మట్టి తరలింపు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు…
నియోజకవర్గ వ్యాప్తంగా ఓ రెడ్ బుక్ ప్రారంభించడం జరుగుతుంది అని ప్రకటించారు..
ఎవరెవరు ఏమేమి వేధింపులకు గురి చేస్తున్నారో అందులో అన్ని లిఖితపూర్వకంగా రాయడం జరుగుతుందని హెచ్చరించారు..
పోలీసులు తమ డ్యూటీ తాము చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డ్యూటీ మీరు చేయొద్దని విజ్ఞప్తి చేశారు…