ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా..!

*ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా*

ఆర్బీఐ నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా నియామకం అయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం డిసెంబర్ 1 ఓ నాటికి ముగుస్తుండగా..

తదుపరి గవర్నర్ గా సంజయ్ మల్హోత్రాను నియమిస్తూ.. నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్, రాజస్తాన్ కేడర్ కు చెందిన మల్హోత్రా ప్రస్తుతం కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 11 నుంచి రానున్న 3 ఏళ్ల పాటు మల్హోత్రా ఈ పదవిలో కొనసాగనున్నారు.