లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు.

Dec 12, 2024,

తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజులపాటు అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజులు అక్కడక్కడా చలిగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది…

తెలుగురాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్‌..

మంచు మనోజ్ పై ఏడాది పాటు బైండోవర్ ..

మంచు మనోజ్ నుంచి లక్ష రూపాయలు పూచికత్తు బాండ్ తీసుకోవటం జరిగింది.

మోహన్‌బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతం.

మంచుఫ్యామిలీలో మూడు కేసులు నమోదయ్యాయి.

నటుడు మోహన్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం.

మోహన్‌బాబు మీడియాపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు.

మనోజ్‌ ఫిర్యాదు కేసులో మోహన్‌బాబు మేనేజర్‌ అరెస్ట్‌ చేసామని సీపీ సుధీర్‌బాబు తెలిపారు..

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం!.

డిల్లీ..

జమిలి ఎన్నికల (One Nation One Election)కు సంబంధించి మరో ముందడుగు పడింది. వీటికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు..

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే (Winter session) జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. దీంతో కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు (Parliament) హాజరు కావాలని తమ ఎంపీలకు భాజపా, కాంగ్రెస్‌లు విప్‌ జారీ చేశాయి..

జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ.. దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (JPC)కి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని భాగస్వామ్య పక్షాలకు అవకాశం కల్పించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి….

CM Revanth: లగచర్ల రైతుకు బేడీపై సీఎం రేవంత్ సీరియస్...

హైదరాబాద్, డిసెంబర్ 12: లగచర్ల రైతుకు బేడీల ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలను సహించేదిలేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే కలెక్టర్‌పై దాడికి పాల్పడిన కొందరు లగచర్ల రైతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో రైతు హీర్యానాయక్ ఒకరు. ఈ రైతు ప్రస్తుతం కంది సెంట్రల్‌ జైలులో ఉన్నాడు. అయితే గత రాత్రి(బుధవారం) హీర్యాకు ఛాతిలో నొప్పి రావడంతో అతడిని జైలు అధికారులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈరోజు కూడా మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం హీర్యానాయక్‌ను సంగారెడ్డి జనరల్ ఆస్పత్రికి జైలు అధికారులు తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రికి తీసుకువస్తున్న సమయంలో హీర్యా నాయక్‌ చేతికి బేడీలు ఉన్నాయి. బేడీలతోనే హీర్యానాయక్‌ను పోలీసులు సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంతేకాకుండా బేడీలతో రైతుకు చికిత్స అందజేశారు. ఇప్పుడు ఇది రచ్చకు దారి తీసింది. రైతును బేడీలతో ఎలా తీసుకువస్తారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బేడీల అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరడంతో సీఎం సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

*_హీర్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై-*

హీర్యా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. హిర్యనాయక్‌కి రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కంది జైల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు రాత్రే ఈసీజీ తీశాం నార్మల్‌గా ఉందని అన్నారు. ఈరోజు ఉదయం మళ్లీ కొన్ని చెక్ అప్‌ల కోసం ఆస్పత్రికి రమ్మని చెప్పమన్నారు. ఉదయం కూడా 2డీ ఈకో, ఈసీజీతో పాటు మిగతా కొన్ని పరీక్షలు చేశామని.. అన్ని నార్మల్‌గానే ఉన్నాయన్నారు. కార్డియాక్‌వలుషేన్ కోసం గాంధీకి రెఫర్ చేశామని.. ప్రస్తుతం వీర్యనాయక్ స్టేబుల్ గానే ఉన్నారని చెప్పారు.. అయిన కూడా సేఫ్ సైడ్ కోసం, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం గాంధీకి రిఫర్ చేశామని అన్నారు. ఇప్పటి వరకు తాము చేసిన ఈసీజీ,2డీ ఈకో టెస్టులో అన్ని నార్మల్ గానే ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిల్ తెలిపారు.

మరోసారి రాజ్యసభకు చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి ఏ రాజకీయ పార్టీలోనూ చేరాలని అనుకోవడం లేదు. అయినప్పటికీ.. ఆయనను బీజేపీ.. రాజ్యసభకు పంపనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చర్చలు జరిపారని, అంతా ఓకే అయిపోయిందని తెలుస్తోంది. అందుకే నాగబాబును రాజ్యసభకు కాకుండా.. ఏపీ కేబినెట్లోకి పంపుతున్నారని సమాచారం.


తమిళనాడులో కుండపోత
3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 10జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

చెన్నైలో నీటమునిగిన పలు ప్రాంతాలు..

సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంత వాసుల తరలింపు..

విమాన సర్వీసులకు అంతరాయం, పలు విమానాలు రద్దు..

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..

‘ఉపాధి’ నిధులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు?: సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమరావతి: రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. చాలామంది అనర్హులకు పింఛన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు..

సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. వంద రోజుల పనిదినాలు సరిగా నిర్వహిస్తే మెటీరియల్‌ కాంపోనెంట్‌ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు.

పల్లె పండగలో 14.8 శాతమే పనులు చేశారన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని గుర్తుచేశారు. అల్లూరి జిల్లాలో 54 శాతమైతే.. మరో జిల్లాలో 1.6 శాతమే పనులు కావడంపై సీఎం ప్రశ్నించారు. పని పూర్తయ్యాక బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని అడిగారు. కలెక్టర్లు ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద ఉపాధి హామీ డబ్బులున్నా బిల్లులు ఎందుకు చెల్లించట్లేదని ప్రశ్నించారు..

”జల్‌జీవన్‌ మిషన్‌ను గత ప్రభుత్వం దెబ్బతీసింది. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించాం. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులుంటే వారికీ పింఛన్‌ ఇవ్వాలి. సదరం ధ్రువీకరణ పత్రాలను అర్హులకే దక్కేలా చూడాలి. రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి చెందే నగరం. విజయవాడ, గుంటూరు వంటివి అమరావతిలో కలిసిపోతాయి. పట్టణీకరణ పెరుగుతున్న దృష్ట్యా నిరంతరాయంగా ప్రణాళికలుండాలి. ఔటర్‌ రింగ్‌రోడ్డు వెలుపల మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి. స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచేలా చూడాలి. స్వచ్ఛత-శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త వదిలి వెళ్లింది. చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు…

ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టులు మృతి..

ఛత్తీస్ఘడ్; నారాయణపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దంతేవాడ మండల పరిధిలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి..

అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో రాత్రివ వేళ కుంబింగ్ నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా వారికి మవోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు పక్షాలు కాల్పుల మోత మోగించాయి. ఈ ఫైరింగ్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?

ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్

అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా?

ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు

ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా?

దీపాదాస్ మున్షీ ఉందా? ఆమె కూడా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిందా?

కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చేస్తారా? ఫైనల్ అయ్యేవరకు మాకు చెప్పరా?

ఓ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణుపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి…

పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం

నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు

అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం

నాసి రకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లు, సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు…

అరెస్ట్ అయిన వ్యక్తికి గుండెపోటు వస్తే కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా!..కేటీఆర్.

ఇంకా ఘోరం ఏంది అంటే.. గుండెపోటు వచ్చిన హీర్యా నాయక్ అనే సోదరుడిని ఆసుపత్రికి బేడీలతో తీసుకువచ్చారు.

నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్ర గవర్నర్ ని, రాహుల్ గాంధీని కోరుతున్నా వెంటనే అరెస్ట్ అయిన వాళ్లను విడుదల చేయండి.

రాహుల్ గాంధీకి మానవత్వం అనేది ఉంటే రేవంత్ రెడ్డిని మందలించండి.. ఆయన ఏమో జైపూర్లో విందులు వినోదాలతో హ్యాపీగా ఉన్నాడు.

ఇక్కడ ఏమో కేవలం తమ భూమిని ప్రభుత్వం డిమాండ్ చేసిన విధంగా మేము ఇవ్వము అని చెప్పిన పాపానికి గిరిజన రైతులు జైలులో చనిపోయే పరిస్థితిలో ఉన్నారు.

రాహుల్ గాంధీ నీకు హృదయం ఉంటే వెంటనే రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు వాపస్ తీసుకొని వాళ్లను వదిలిపెట్టమని చెప్పు.. వాళ్ళకి ప్రైవేట్ ఆసుపత్రిలో మేము చికిత్స చేపిస్తాము – కేటీఆర్…

అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఆ తర్వాత కూల్చి వేత నోటీసులిచ్చే అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..

అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి, ఆ తర్వాత కొన్నేళ్లకు కూల్చివేత నోటీసులిచ్చే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తే కాని సరిగా విధులు నిర్వహించరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

నష్టపరిహారం కూడా సదరు అధికారుల నుంచే వసూలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన స్థితి వస్తుందని హెచ్చరించింది.

అధికారుల ఆస్తులు జప్తు చేస్తే అప్పుడు తెలిసి వస్తుందని పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో సర్కార్ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అధికారుల తప్పులకు ప్రజాధనం వెచ్చించడం సరికాదని అభిప్రాయపడింది.

నిర్మాణం అక్రమమైనప్పుడు ఆ నిర్మాణం చేపట్టడానికి ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించింది. అవకతవకలకు పాల్పడి అనుమతులిచ్చి.. నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడింది…

*_తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు_*

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజులపాటు అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజులు అక్కడక్కడా చలిగాలులు వీస్తాయని వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది…

పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారని RBI గణాంకాలు చెబుతున్నాయి..RBI ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి… హరీష్ రావు..

నీన్న RBI ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయన్నారు సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆయన మండిపడ్డారు..బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారం అంతా తప్పని తేలిపోయిందన్నారు హరీష్.

పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారని RBI గణాంకాలు చెబుతున్నాయన్నారు. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి రికార్డు సృష్టించిందని తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్టమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పుల రాష్టం అని ప్రచారం చేసిందని మండిపడ్డారు. సీఎం లేని దివాలాని ప్రచారం చేసి మాపై బురద జల్లేందుకు ప్రయత్నించి ఆయనే బురద జల్లుకున్నారన్నారు. 7 లక్షల కోట్ల అప్పు అని ప్రచారం కాంగ్రేస్ మంత్రులు పదే పదే గోబెల్స్ చేశారని మండిపడ్డారు. .2014, 15 ఏడాది ముందే 72, 658 కోట్ల అప్పుని తెలంగాణకి గత కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చిందని 2024 డిసెంబర్ 7 నుంచి మార్చి 2024 వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. రెండు కలిపితే ఒక లక్ష 6 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. పదేళ్ల BRS హయాంలో 3, 22, 499 కోట్ల రూపాయల అప్పు మాత్రమే మేము చేశామని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా RBI వెల్లడించిందన్నారు. ఇప్పటికైనా విషప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలి హితవు పలికారు..