చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని అభ్యర్థించిన పోలీసులు.!

సాయంత్రం నాలుగు గంటలకు అల్లు అర్జున్ ఖ్వాష్ పిటిషన్ విచారణ..❓* _• పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు.._ Update from Advocate.

చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని అభ్యర్థించిన పోలీసులు.!..

పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న నిర్మాత దిల్ రాజు..

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ఈ ఘటనపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 118 (1), బీఎన్‌ఎస్‌ 105, రెడ్‌విత్‌ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 105 సెక్షన్‌ (నాన్‌ బెయిలబుల్‌ కేసు) కింద ఐదు నుంచి పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్‌ ఇప్పటికే ఆమె రూ.25 లక్షలు సాయం ప్రకటించాడు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని పేర్కొన్నాడు.

ఎఫ్ఐఆర్‌ కొట్టివేయాలంటూ పిటిషన్‌...

కాగా చికడపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ ఇప్పటికే థియేటర్‌ యాజమాన్యం, భాగస్వాములు పిటిషన్లు దాఖలు చేశారని తెలిసిందే. ఆ తర్వాత అల్లుఅర్జున్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేశాడు. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లకు నటులు వెళ్తుంటారని, ఇది సహజంగా జరిగేదేనని తెలిపాడు.

ఇదివరకు కూడా పలుమార్లు సినిమా ప్రదర్శనల సమయంలో తాను వెళ్లానని.. ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోలేదని అల్లు అర్జున్‌ తెలిపాడు. సంధ్య థియేటర్‌కు వెళ్లేముందు తాను థియేటర్‌ నిర్వాహకులకు, స్థానిక ఏసీపీ తదితర పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు. భద్రత కోసం ముందస్తుగా సమాచారం ఇచ్చామని.. ఇందులో తన నిర్లక్ష్యమేమీ లేదన్నాడు.

తాను థియేటర్‌కు వెళ్లిన కారణంగానే తొకిసలాట జరిగిందని మృతురాలి భర్త ఫిర్యాదులో పేరొనడం సరికాదని అన్నాడు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నమోదు చేసిన అభియోగాలేవీ తనకు వర్తించవని తెలిపారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, విచారణ ప్రక్రియను నిలిపివేయాలని, ఈలోగా తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు అల్లు అర్జున్‌. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు అరెస్ట్‌ చేశారు..

కోర్టులో నడించింది ఇలా..

*Exclusive*
*🔹అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి.*

_• సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు._

_• పోలీసులను అడిగి 2.30కి చెబుతానన్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్._

*•విచారణ 2.30కి వాయిదా*.

*మధ్యాహ్నం 2.30గంటలకు చెబుతాం*

హైకోర్టు అల్లు అర్జున్ పై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరఫు లాయర్ కోరడంపై హైకోర్టు జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అభిప్రాయం తెలుసుకొని మ.2.30 గంటలకు చెబుతామని వెల్లడించారు. అయితే *🔹ఇప్పటికే అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని లాయర్ కోరగా హైకోర్టు తిరస్కరించింది.* ఉ.10.30 గంటలలోపే పిటిషన్ జత చేయాల్సిందని చెప్పింది..

*🔹సాయంత్రం నాలుగు గంటలకు అల్లు అర్జున్ ఖ్వాష్ పిటిషన్ విచారణ..❓*

_• పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు.._

Update from Advocate

*_🔹చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన చిరంజీవి_*

– *షూటింగ్ మధ్యలో ఆపి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన చిరంజీవి.

*🔹అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి , సతీమణి సురేఖ*..

అల్లు అరవింద్ ను పోలీస్ వాహనం ఎక్కవద్దని కోరిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ ను పోలీసులు తమ వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే సమయంలో అరవింద్ కూడా వారితో కలిసి వెళ్లేందుకు పోలీస్ వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. అయితే అల్లు అర్జున్ తండ్రిని వారించారు. పోలీస్ వాహనం ఎక్కవద్దని కోరారు.దీంతో అరవింద్ తన చిన్న కొడుకు అల్లు శిరీష్ తో కలిసి మరో వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు.