తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కారు రేసుపై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు..ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తరువాత నిర్ణయం తీసుకుందామని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకోవటంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాగితాలు, వాటర్ బాటిల్స్ విసిరివేయడంతో సభలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది..
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తమకు సభలోనే చెప్పులు చూపించాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పు చూపించారని మండిపడ్డారు. షాద్ నగర్ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ ను అమానించేలా సభలో వ్యవహరించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే, తొలుత మంత్రి పొంగులేటిపై వాటర్ బాటిల్స్ విసిరారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు…
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఈ సందర్భంగానే సభలో గొందరగోళం నెలకొంది. కేటీఆర్‌పై పెట్టిన ఫార్ములా ఈ కేసుపై చర్చించాలని నినాదాలు చేస్తూనే ఉన్నారు. పొంగులేటి మాట్లాడుతున్న టైంలో మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఆ క్రమంలోనే కొన్ని పేపర్లు చించి స్పీకర్‌పై వేయడంతో సభ ఆర్డర్ తప్పింది. బీఆర్ఎస్ చర్యలతో సీట్ల నుంచి లేచిన కాంగ్రెస్ సభ్యులు వారికి పోటీగా నినాదాలు చేశారు. ఇలా ఇరువర్గాలు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. వాటర్ బాటిళ్లు ఇసురుకున్నారు. పరిస్థితి గమనించిన స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
పొంగులేటి ఆగ్రహం...
ప్రశ్నోత్తరాల తర్వాత భూభారతి బిల్లుపై చర్చను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ధరణి పోర్టల్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీగా కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఈ పోర్టల్ వల్ల సామాన్యులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వాటన్నింటినీ గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రజలకు మేలు చేసే చట్టం తీసుకొస్తామని చెప్పామన్నారు. అందుకే ఇన్ని రోజులు వివిధ వర్గాల నుంచి సమాచారన్ని తీసుకొని భూభారతి చట్టం రూపొందించినట్టు తెలిపారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని వివరించారు. ఇది భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చుట్టం అవుతుందన్నారు పొంగులేటి..
విపక్ష సభ్యులకు చెప్పు చూపించాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరోపణలు.. !
బిpఆర్ఎస్ ఎమ్మెల్యేలపైకి చెప్పుచూపించారట కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య. అసెంబ్లీలో షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత, అసభ్య ప్రవర్తన వివాదంగా మారింది..అసెంబ్లీలో ఎమ్మెల్యే శంకర్ తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
congress
షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పు చూపించారంటూ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. అసెంబ్లీ ఫుటేజ్ బయటపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్…నిరసనకు దిగింది. ఇక అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ప్రసాద్ పైకి పేపర్లు విసిరారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ-కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు…
విపక్ష సభ్యులకు చెప్పు చూపించాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేస్‌పై సభలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపట్టింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు కేటీఆర్‌పై కేసు పెట్టారని, అక్రమ కేసు పెట్టినప్పుడు ఆయనకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని హరీశ్ రావు స్పీకర్‌ను కోరారు. దీనికి స్పీకర్ ప్రసాద్ కుమార్ నిరాకరించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.