ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల
*వీటి ధరలు తగ్గాయి*
*మాన్షన్ హౌస్* క్వార్టర్ ధర 2019లో గత టీడీపీ సర్కార్‌లో రూ.110 ఉండగా వైఎస్సార్సీపీ పాలనలో మొదట్లో రూ.300కు విక్రయించారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్ బాటిల్ ధర రూ.440 ఉండగా రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది.
*రాయల్ చాలెంజ్* సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది.
*యాంటిక్విటీ విస్కీ* ఫుల్ బాటిల్ ధర రూ.1600 కాగా రూ.1400కు తగ్గింది..
*శబరిమలకు పోటెత్తిన భక్తులు*
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్, డిసెంబర్ 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజతో ముగియనుంది. రాబోయే రోజుల్లో రోజుకు లక్షకు పైగా భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు..
విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం..
ఉత్తర దిశగా కదులుతున్న వాయుగుండం..
చెన్నైకి 370 కి.మీ. దూరంలో కేంద్రీకృతం..
విశాఖకు 450 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం..
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన..
రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం..
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
ఆంధ్రప్రదేశ్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేటి (శనివారం) నుంచి 25 వరకు జరగనున్నాయి. 6 లక్షల మంది భవానీ దీక్షాధారులు ఐదు రోజుల్లో గిరి ప్రదక్షిణ పూర్తి చేసి, ఇరుముడులు మల్లికార్జున మహా మండపంలో గ్రౌండ్ ఫ్లోరులో సమర్పించాల్సి ఉంటుంది. తొలి రోజున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహిస్తారు. ఉ.6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు…
ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ ..
ఆంధ్రప్రదేశ్ : శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుళ్ల సముద్రం సమీపంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గుడిబండ, అమరాపురం వాసులుగా గుర్తించారు. తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో టెంపోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు…
నల్లగొండ జిల్లా
దేవరకొండ..
బైక్ ను ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురు స్పాట్ డెడ్..
దేవరకొండ పట్టణంలో మల్లేపల్లి రోడ్డులో గల దర్గా దగ్గర బైక్ ని డికోట్టిన డీసీఎం.. బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మరణించారు.మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన హాజీ కుటుంబ సభ్యులుగా గ్రామస్తులు గుర్తించారు.. దర్గా నుండి దేవరకొండ పట్టణం వైపు వస్తున్నా బైక్ ని వెనుకనుండి వచ్చి డీసీఎం గుద్దడంతో బైక్ పై ఉన్న ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు.మృతులలో ఇద్దరు పురుషులు, ఒక మహిళా ఉన్నది..
ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు?.. కెటిఆర్.
.
ఇదేనా రేవంత్(CM Revanth Reddy).. నువ్వు తీసుకొచ్చిన మార్పు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు..అప్పుల బాధతో ఆటో డ్రైవర్(Auto Driver) ఆత్మహత్య(Scuicide) అని వచ్చిన వార్తపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. పైసలతో దగదగమెరిసిన చేతుల్లోకి పురుగుల మందుల డబ్బాలు రావడమే మార్పా? అని, ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి, ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? అని దుయ్యబట్టారు. అంతేగాక రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న 12వేల సాయమేది? అని, రాహుల్ గాంధీ(Rahul Gandhi).. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? అని నిలదీశారు. అలాగే ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు! అని, తెలంగాణను(Telangana) తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు! అని చెబుతూ.. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు! అని వ్యాఖ్యానించారు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై హైదరాబాదులో ఫిర్యాదు..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పై హైదరాబాద్(Hyderabad) లో ఫిర్యాదు(complaint) నమోదు అయ్యింది. లోక్ సభ(Lok Sabha) సాక్షిగా డా బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) ను అవమానించారని హైదరాబాద్ కు చెందిన కార్తీక్ అనే న్యాయవాది తెలంగాణ డీజీపీ(Telangana DGP)కి లేఖ రాశారు. పార్లమెంట్లో అంబేద్కర్ పేరును అమర్యాదగా ఉచ్చరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం అవుతోందని, అంబేద్కర్ పేరుకు బదులుగా భగవాన్ పేరు జపం చేస్తే ఏడు జన్మలకు స్వర్గం లభిస్తుందని అమిత్ షా చెప్పారని పేర్కొన్నారు. అయితే అమిత్ షా ప్రసంగం ప్రధానంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ పేరును దుర్వినియోగం చేసిందని చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఆయన ప్రస్తావించిన విధానం అభ్యంతరకరంగా, అగౌరవంగా ఉందని, ఇది భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 352 తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి(SC and ST Atrocities) సమానం అవుతుందని తెలిపారు. కావున అమిత్ షా S/o అనిల్‌చంద్ర షాపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసి, విచారణ జరిపి, న్యాయ ప్రయోజనాల దృష్ట్యా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయవాది కార్తీక్(lawyer Karthik) ఫిర్యాదులో పేర్కొన్నారు..
మొన్నటిదాకా జైలుకెళ్తా.. యోగా చేస్తా అన్నారు..కేటీఆర్.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క.
మొన్నటిదాకా జైలుకెళ్తా.. యోగా చేస్తా.. స్లిమ్ అయి వస్తా అని కామెంట్లు చేసిన కేటీఆర్.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క నిలదీశారు…
ప్రభుత్వ అనుమతి లేని అంశానికి సభలో చర్చ పెట్టాలనడం వింతగా ఉందన్నారు. అసెంబ్లీ ఆవరణలో సీతక్క మీడియాతో చిట్‌చాట్ చేశారు. ”గతంలో ప్రభుత్వ కేసులు ఎదుర్కొన్న నాయకులు కోర్టుకు వెళ్తే కేటీఆర్ తప్పుబట్టిండు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కినట్లు? కేటీఆర్‌కు నిజాయితీ లేదు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే భూ భారతి బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నడు. భూ కబ్జాల బాగోతం ఎక్కడ బయటపడుతుందో అని బీఆర్ఎస్ లీడర్లకు భయం పట్టుకున్నది..చట్టం ముందు అందరూ సమానమే. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో విచారణ ఎదుర్కోవాల్సిందే. గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసుపై సభలో చర్చ అవసరం లేదు. బీఏసీలో ఈ ఫార్ములా కేసుపై చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదు? పార్లమెంట్లో అంబేద్కర్‌ను.. అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించారు”అని సీతక్క ఫైర్ అయ్యారు…
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం లేదు..శ్రీరామ్.
అఫిడవిట్.. ఇలాగేనా దాఖలు చేసేది?.చెత్తబుట్టలో పడేయడానికి తప్ప, దేనికీ పనికి రావు” అని ఎమ్మెల్సీ కోదండరామ్‌కు కాళేశ్వరం కమిషన్ చురకలు..
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైన్లకు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం లేదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నా తొలుత సరైన ఇన్వెస్టిగేషన్లు జరగాలని, ఆ ఫలితాల ఆధారంగా డిజైన్లు/డ్రాయింగ్లు పూర్తయ్యాక నిర్మాణం జరగాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో ఇవేమీ జరగలేదని గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట శుక్రవారం ఆయన మరోసారి విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జల వనరుల సంఘాని(సీడబ్ల్యూసీ)కి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) రాసిన లేఖను సాక్ష్యంగా గతంలో వెదిరె శ్రీరామ్ సమర్పించగా… ఆ లేఖలో వ్యత్యాసాలు ఉన్నట్లు కమిషన్ గుర్తు చేసింది. ఏ అధికారంతో అధికారిక పత్రాలను సంపాదించారని ప్రశ్నించగా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా సంపాదించానని, అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లేనని ఆయన చెప్పారు. డిజైన్లకు అవరమైన వివరాలను అప్పటి ప్రభుత్వం సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో)కు ఇవ్వలేదని, సరైన వివరాలు లేకుండా డిజైన్లు రూపొందించారని ఆరోపించారు. ”బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించిన దాఖలాలు కనిపించడం లేదు.
నిర్మాణం తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం) పనులు జరగలేదు. 2019లో వరదలు తగ్గుముఖం పట్టాక మేడిగడ్డ బ్యారేజీ దిగువ భాగంలో సీసీ బ్లాకులు చెల్లాచెదురైనట్టు గుర్తించారు. వాటిని అప్పుడే సరిచేయాల్సి ఉండ గా.. చేయలేదు. ఈ విషయమై నిర్మాణ సంస్థ, అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా.. పనులు చేపట్టలేదు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదిక ప్రకారం 3 బ్యారేజీల్లోనూ ఓ అండ్ ఎం నిధులు వెచ్చించిన దాఖలాల్లేవు. పునాదుల నుంచి ఇసుకంతా జారి… మేడిగడ్డ కుంగింది. అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడ్డాయి. ప్రతిపాదిత ప్రదేశాలకు 2.2కిలోమీటర్ల దూరంలో సుందిళ్ల, 5.4 కి.మీ దూరంలో అన్నారం బ్యారేజీని కట్టారు. పరీక్షలు ఒకచోట జరిగితే… బ్యారేజీలు ఒక చోట కట్టారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పినా.. అప్పటి సీఎం నిర్ణయం మేరకే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టలేదు. హడావుడిగా కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం చేపట్టారు. ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో తొందరపాటు చర్యలకు పాల్పడ్డారు. డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించడానికి ముందే నిర్మాణం ప్రారంభించారు” అని శ్రీరామ్ తెలిపారు.
అఫిడవిట్.. ఇలాగేనా దాఖలు చేసేది?
”అఫిడవిట్ దాఖలు చేసే విధానం ఇదే నా? సమగ్ర సమాచారంతోపాటు అఫిడవిట్లో పేర్కొన్న అంశాలకు సాక్ష్యాలు సమర్పించాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. మీరు పేర్కొంటున్న పత్రాలు గతంలోనే సేకరించామని, మళ్లీ ఇచ్చే పత్రాలు చెత్తబుట్టలో పడేయడానికి తప్ప, దేనికీ పనికి రావు” అని ఎమ్మెల్సీ కోదండరామ్‌కు కాళేశ్వరం కమిషన్ చురకలు అంటించింది. విచారణ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ తొందరపాటుతో కాళేశ్వరం కట్టారని, ఇది తెలంగాణకు గుదిబండగా మారిందని దుయ్యబట్టారు. కాగా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో తన పాత్ర లేదని, కొంత కాలం మాత్రమే నీటిపారుదల శాఖ బాధ్యతలు చూశానని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. కమిషన్ ముందు హాజరైన ఆయన.. అప్పట్లో మైనర్ ఇరిగేషన్, భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ బాధ్యతలు చూశానని వివరించారు.
పండగ సమయంలో మండిపోతున్నా వంట నూనె ధరలు ..సామాన్య మధ్య తరగతి ప్రజలకు పండుగ పూట ఇబ్బందిలు..!
వంట నూనె ధరలు మండిపోతున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు పండుగ పూట ఇబ్బంది పెడుతున్నాయి. విపరీతంగా పెరిగిన వంట నూనె ధరలతో సంక్రాంతి పండుగకు ఏం వండుకోవాలి అన్నట్టు సామాన్య మధ్య తరగతి ప్రజలు సందిగ్ధంలో పడుతున్నారు…ఒకపక్క క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగలు వరుస పెట్టి వస్తున్న వేళ వంట నూనెల ధరలు కూడా పై పైకి ఎగసిపడడం ప్రధానంగా కనిపిస్తుంది.
బాగా పెరిగిన వంట నూనె ధరలు
అయిదారు నెలల క్రిందట 100 రూపాయలకు దిగువన ఉన్న పామాయిల్ రేటు ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. తాజాగా పామాయిల్ ధర ఇప్పుడు 150 రూపాయలకు పైగా చేరింది. ఇక పండుగ సీజన్ ముందు నూనె వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అదనంగా ఖర్చు కూడా భరించవలసి వస్తుంది. వంట నూనెల పై రెండు నెలలవీధిలో లీటర్ కు కనిష్టంగా 20 రూపాయల ధర పెరిగింది.
ధరలు పెరగటంతో సామాన్యులపై భారం..
దీంతో నెలకు 9 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రతి జిల్లాలోని ప్రజలు మోయాల్సి వస్తుంది. ఈ నెలలోనే పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్ లీటర్ కు సగటున 20 రూపాయలు ధర పెరిగింది. ఇక వేరుసెనగ నూనె ధర 170 నుంచి 175 రూపాయల మధ్య కొనసాగుతుంది. అయితే దీని ధరలో పెద్దగా హెచ్చుతగ్గులు లేకపోవడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ధరలను తగ్గించేందుకు ప్రభుత్వ చొరవ..!
ప్రస్తుతం పండుగ సీజన్లో నూనెల ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అశనిపాతంగా మారింది. మరోవైపు దుకాణం దారులు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధరల నియంత్రణకు చొరవ చూపాలని, లేదంటే తక్కువ ధరకు నూనె అందించేలా ప్రత్యేక కేంద్రాలను, రేషన్ షాపుల్లో నూనె ఇచ్చేలా ఏర్పాటును చేయాలని కోరుతున్నారు.
పండుగల వేళ ప్రభుత్వం స్పందిస్తుందా?
కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారికి ధరల బాదుడును తగ్గించడానికి ప్రభుత్వం చొరవ చూపితేనే పండుగలు చేసుకోగలుగుతామని వారు చెబుతున్నారు. మరి వంటనూనె ధరలు నియంత్రణకు ప్రభుత్వాలు ఎటువంటి చొరవ తీసుకుంటాయనేది వేచి చూడాల్సిందే..
ఏపీలో ఈ బ్రాండ్ల మద్యం ధరలు తగ్గింపు – కొత్త రేట్లు ఇలా..!!
ఆంధ్ర లో కొత్త సంవత్సరం వేళ మందు బాబులకు మంచి కిక్కు ఇచ్చే వార్త. మద్యం కంపెనీలు మరి కొన్ని ఏపీలో ధరలు తగ్గించేందుకు నిర్ణయించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తామని హామీ ఇచ్చింది..కొత్త మద్యం పాలసీ మేరకు కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. ధరల విషయంలోనూ వస్తున్న ఫిర్యాదు లతో ప్రభుత్వం అలర్ట్ అయింది. కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు ధరలు తగ్గించగా.. తాజాగా మరో 11 కంపెనీలు తమ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
ధరల తగ్గిస్తూ నిర్ణయం
ఏపీలో మద్యం ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సమయం నుంచి అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. అధిక ధరలు, బెల్టు షాపుల నిర్వహణ పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. వీటిని నియంత్రించేందుకు మద్యం దుకాణాలకు హెచ్చరికలు చేసింది. అధిక ధరలకు విక్రయించినా, బెల్టు షాపులను ప్రోత్సహించినట్లు గుర్తిస్తే తొలి సారిగా జరిమానా, ఆ తరువాత లైసెన్సు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. అటు మద్యం విక్రయాలను ఎక్సైజ్ శాఖ గమనిస్తోంది. అదే సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం బెల్టు షాపుల పైన అలర్ట్ అయింది.
రూ 30 వరకు తగ్గింపు
ఇక, గత ప్రభుత్వంలో దూరమైన బ్రాండెడ్ మద్యం ప్రస్తుతం ఏపీలో అందుబాటులోకి వచ్చింది. రూ 99 కే క్వార్టర్ మద్యం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్ లో మద్యం అమ్మ కాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నార నే ఫిర్యాదులు ఉన్నాయి. ధరలు తగ్గింపు విషయంలో ప్రభుత్వం లిక్కర్ కంపెనీలతో వరుసగా చర్చలు చేసింది. కొద్ది రోజుల క్రితం మూడు కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు మరో 11 కంపెనీలు తాము అందించే మద్యం ధరల ఎమ్మార్పీ దాదాపు రూ 30 మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.
మద్యం తాజా ధరలు
దీంతో, ఏపీలో పలు రకాల మద్యం ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మాన్షన్ హౌస్ బ్రాందీ క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కు తగ్గింది. అదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర రూ.440 నుంచి రూ.380, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కు తగ్గించారు. రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210 తగ్గింది. ఇదే బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కు తగ్గించారు. యాంటిక్విటి బ్లూ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ. 1600 నుంచి రూ.1400 తగ్గించారు. ఇప్పుడు మరిన్ని కంపెనీలు మద్యం ధరలు ముందుకు రావటంతో వాటి ఉత్పత్తుల ధరలను ఖరారు చేసారు. ప్రతీ దుకాణం వద్ద ధరల పట్టిక ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది…
*45 కోచింగ్ సెంటర్లపై కేంద్రం కఠిన చర్యలు*
తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన కారణంగా వివిధ కోచింగ్ సెంటర్లకు 45 నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 19 ఇన్స్టిట్యూట్లకు రూ.61.6లక్షల జరిమానా విధించినట్టు తెలిపింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి బీఎల్ వర్మ రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు..
*_ఆరెస్సెస్ నేతల లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన ఇస్లామిక్ ఉగ్రవాదుల అరెస్ట్_*
ఆరెస్సెస్, ఇతర హిందూ ధర్మ సంస్థల గ్రూపులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేసిన అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులను అసోం ఏటీఎస్ అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్, అసోంలో ఏటీఎస్ పోలీసులు ఏక కాలంలో రెండు రోజుల పాటు దాడులు నిర్వహించారు.ఈ ఆపరేషన్ కి ‘‘ప్రఘట్’’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఎనిమిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. కేరళలో అరెస్టైన వారిలో అల్ ఖైదా అనుబంధంగా వున్న ఇస్లామిక్ ఉగ్రవాది ఎండీ సాద్ రాడి అకా ఎండీ షాబ్ సేఖ్ వున్నాడు.
ఇక.. మినారుల్ షేక్, ఎండీ అబ్బాస్ అలీ, నూర్ ఇస్లాం మండల్, అబ్దుల్ కరీం మండల్, ముజీబర్ రెహ్మాన్, హమీదుల్ ఇస్లాం, ఇనాముల్ హక్ గా గుర్తించామని ఏటీఎస్ పేర్కొంది. దేశంలో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి, మత సామరస్యానికి భంగం కలిగించాలని చూస్తున్నారని అసోం స్పెషల్ డీజీపీ హర్మీత్ సింగ్ తెలిపారు. వీరి నుంచి కొన్ని కీలక పత్రాలు, వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు కేరళ, బెంగాల్లో నివసిస్తున్న ఈ ఉగ్రవాదులు అల్‌ఖైదా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్న మహ్మద్ ఫర్హాన్ ఇస్రాక్ కోసం పనిచేస్తున్నట్లు తాము గుర్తించామని ఏటీఎస్ తెలిపింది..
ఢిల్లీకి వెళ్లే 14 రైళ్లు ఆలస్యం..
*దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని పొగమంచు చుట్టుముట్టడంతో అనేక రైళ్ల కదలిక ప్రభావితమైంది, దీని వలన తక్కువ దృశ్యమానత ఏర్పడింది.*
*ఢిల్లీకి వెళ్లే 14 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. స్టేషన్‌కు చేరుకునే ముందు ప్రయాణికులు రైళ్ల తాజా స్థితిని తనిఖీ చేయాలని సూచించారు..