బుమ్రా దెబ్బకు ఆసీస్ యంగ్ ప్లేయర్ ఔట్..!.కుర్రాడికి తిరిగి ఇచ్చేసిన జస్ప్రిత్ బుమ్రా…

టెస్టులో ఆరంగ్రేటం చేసిన 19 ఏళ్ల ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్ శామ్ కాన్‌స్టాస్, తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన శామ్ కాన్‌స్టాస్‌ని మహ్మద్ సిరాజ్ సెడ్జ్ చేయడం, విరాట్ కోహ్లీ కావాలని భుజంతో డాష్ ఇవ్వడం…తీవ్ర వివాదాస్పదమైంది. 19 ఏళ్ల కుర్రాడితో కావాలని గొడవ పెట్టుకోవడంతో విరాట్ కోహ్లీకి 20 శాతం మ్యాచ్ ఫీజు ఫైన్ కూడా పడింది… అన్నింటికీ మించి తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో 2 సిక్సర్లు బాదాడు శామ్ కాన్‌స్టాస్..

టెస్టు క్రికెట్‌లో బుమ్రా బౌలింగ్‌లో 4483 బంతుల తర్వాత సిక్సర్ కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు శామ్ కాన్‌స్టాస్. అంతేకాదు, బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు మొదటి బ్యాటర్, ఒకే ఓవర్‌లో 18 పరుగులు రాబట్టిన బ్యాటర్ కూడా శామ్ కాన్‌స్టాస్‌యే! బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో పాటు మరో 4 పరుగులు చేసి 18 పరుగులు రాబట్టాడు శామ్ కాన్‌స్టాస్..ఈ ఓవర్ తర్వాత మరింత అరవడం అంటూ స్టేడియంలోని ప్రేక్షకులకు సైగలు చేశాడు. అలాగే తనతో గొడవపడిన విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత కూడా ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు శామ్ కాన్‌స్టాస్.. రెండో ఇన్నింగ్స్‌లో ఈ కుర్రాడికి తిరిగి ఇచ్చేశాడు జస్ప్రిత్ బుమ్రా….

ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. అరంగేట్ర ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కొన్‌స్టాస్‌ (8)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో కొన్‌స్టాప్ రెండు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇన్నింగ్స్‌లో కొన్‌స్టాప్‌ను ఔట్ చేసిన వెంటనే బుమ్రా డిఫరెంట్‌గా సంబరాలు చేసుకున్నాడు. ప్రేక్షకులు అందరూ గట్టిగా అరవాలంటూ సైగ చేశాడు. కోహ్లీ ఔట్ అయిన కొన్‌స్టాప్ కూడా ఇలానే చేశాడు. అందుకే బుమ్రా కూడా తనదైన స్టైల్‌లో స్వీట్ రీవేంజ్ తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో పలుమార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కొన్‌స్టాప్.. చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.