పొంచి ఉన్న ఆర్టీసీ సమ్మె ముప్పు…!?

వేతనాల పెంపుతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం కేఎస్‌ ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బంది ఈ నెల 31వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు..దీంతో వేలాది బస్సులు బస్టాండ్లకే పరిమితమై ప్రజలకు ప్రయాణవసతి ఉండదన్న ఆందోళన నెలకొంది. ప్రజలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఏర్పడింది.

బీఎంటీసీలో ఎస్మా ప్రయోగం!

ఇక బెంగళూరులో సామన్య ప్రజలకు బీఎంటీసీ బస్సులే దిక్కు. అవి లేకపోతే నగరం స్తంభించిపోతుంది. ఈ నేపథ్యంలో సమ్మె జరగకుండా సిద్దరామయ్య సర్కారు అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. బీఎంటీసీ ఉద్యోగులపై సంస్థ పాలకమండలి ఎస్మా చట్టాన్ని ప్రయోగిచనుంది. అత్యవసర సేవల నిబంధన -2013 కు అనుగుణంగా బీఎంటీసీ సేవలను అత్యవసర సేవలుగా పరిగణించారు. రానున్న 6 నెలలు వరకు ఉద్యోగులు సమ్మె చేయరాదని పాలకమండలి ప్రకటించింది. జనవరి 1 నుంచి వర్తించేలా 6 నెలలు బీఎంటీసీ ఉద్యోగుల సమ్మైపె ఆంక్షలు విధించామని బీఎంటీసీ భద్రతా జాగృతి అధికారి ఆదేశించారు. దీంతో సిటీ బస్‌ సిబ్బంది సమ్మెకు దిగితే సర్కారు ఎలాంటి చర్యలైనా తీసుకునే అవకాశం ఉంటుంది.

25 శాతం జీతం పెంచాలి

రవాణా ఉద్యోగులకు మూలవేతనాన్ని 25 శాతం పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వం రూ.5010 కోట్ల బకాయిలను చెల్లించాలి, మహిళల ఉచిత ప్రయాణ పథకం వల్ల నష్టపోయిన రూ.2 వేల కోట్లను ఆర్టీసీకి విడదుల చేయాలని ఉద్యోగుల ఉమ్మడి క్రియాసమితి అధ్యక్షుడు ఉమేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2020లో వేతనం పెంచుతామని ప్రకటించినప్పటికీ రూ.1750 కోట్ల వేతన బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

31 నుంచి బస్సుల బంద్‌..!

ఉద్యోగ సంఘాల ప్రకటన.!

వేతనాల పెంపు, బకాయిల ..విడుదలకు పట్టు

బీఎంటీసీలో 6 నెలలు సమ్మెల రద్దు: సర్కారు

వేలాది కోట్ల బకాయిలు

2024 జనవరిలో వేతనం పెంపు జారీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు స్ట్రైక్‌ చేయాలని తీర్మానించామని కేఎస్‌ ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు హెచ్‌వీ. అనంత సుబ్బారావ్‌ చెప్పారు. ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో సమ్మె చేయడం మినహా వేరేదారి లేదని తెలిపారు. 2020 నుంచి 2023 ఫిబ్రవరి వరకు బాకీ ఉన్న సుమారు రూ.1785 కోట్ల వేతనాలను ఇవ్వాలని కోరారు. రూ.2900 కోట్ల భవిష్యనిధిని జమ చేయాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్‌లో ఉండే రూ. 325 కోట్ల టీఏను మంజూరు చేయాలన్నారు. సమ్మె చేయడానికి 21 రోజులు ముందుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు. తమ కడుపు కొట్టరాదని, ఎస్మా ప్రయోగించినా ఫరవాలేదని అన్నారు. సమ్మె విరమణ కోసం ఆర్టీసీ సంఘాలతో సర్కారు పెద్దలు మంతనాలు జరుపుతున్నారు.