🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 03 – 01 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చవితి* రా12.53 వరకు,
నక్షత్రం : *ధనిష్ఠ* రా12.00 వరకు,
యోగం : *వజ్రం* మ2.40 వరకు,
కరణం : *వణిజ* మ1.36 వరకు
తదుపరి *విష్ఠి* రా12.53 వరకు,
వర్జ్యం : *లేదు*,
దుర్ముహూర్తము : *ఉ8.47 – 9.31*,
మరల *మ12.26 – 1.10*,
అమృతకాలం : *మ1.56 – 3.29*,
రాహుకాలం : *ఉ10.30 – 12.00*,
యమగండం : *మ3.00 – 4.30*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం: 5.34,
*_నేటి మాట_*
*ఆధ్యాత్మిక ఉన్నతికి మన సాధన!!*
_ముందుగా ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రాధమిక సూత్రాలు కొన్ని తెలుసుకుందాము…!!_
✓ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా దైవ నామ జపం చేయాలి…
✓ నిరంతరం సత్సంగం లేదా సద్గ్రంథ పఠనం కొనసాగించాలి…
✓ విన్న మంచి మాటలను ఆచరించి, సత్శీలంతో జీవించాలి…
ఈ సూత్రాలు పాటించకుండా ఎవరు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించలేరు…
మనసులో వ్యాపకాలు పెరిగే కొద్దీ దైవ నామ స్మరణ తగ్గిపోతుంది…
వంద వ్యాపకాలలో దైవస్మరణ ఒకటైతే దైవ దర్శనం సులభ సాధ్యం కాదు, ఏ వ్యాపకమైనా సంతోషంగానో, దుఖంగానో ముగుస్తుంది…
నిజానికి సంతోషం, దుఃఖం క్షణికానుభవాలు, కానీ సంతోషాన్ని కావాలను కోవటం, దుఃఖాన్ని వద్దను కోవటం చేత అవి మరింత విస్తృతమై, శాంతిని దూరం చేస్తున్నాయి…
ప్రతి పనిలోనూ త్రికరణ శుద్ధి అలవడితే మనసు నిరంతరం వర్తమానంలో ఉంటుంది.
అలా ఉన్న మనసుకు ఆశ, కోరిక, సంతోషం, దుఃఖం ఏవైనా క్షణికానుభవాలే అవుతాయి.
అందుకే వర్తమానంలో ఉన్న మనసు తన స్వరూపమైన శాంతిని అఖండంగా అనుభవించ గలుగుతుంది, ఆ అఖండ శాంతి కోసమే మనం ఆధ్యాత్మిక సాధన చేయ్యాలి..
*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏