ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కాన్వాయ్(Convoy) కి ప్రమాదం(Accident) జరిగింది. పోలీస్ వాహనం(Police vehicle) అదుపు తప్పి బోల్తా పడింది…వరంగల్ పర్యటన(Warangal tour)లో భాగంగా భట్టి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. మార్గమద్యంలో జనగామ(Janagama)లోని పెంబర్తి కళాతోరణం(Pembarthi Kalathoranam) వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్ లోని పోలీస్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ట పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, కారు డ్రైవర్ కు గాయాలు అయ్యాయి…క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం భట్టి వరంగల్ పర్యటనకు బయలు దేరారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.