త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) టార్గెట్ గా ఇప్పటికే పలు సందర్భాల్లో కామెంట్లు చేసిన ఆమె తాజాగా మరోసారి కామెంట్స్ చేశారు.



డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో( Movie Artists Association ) తాను ఫిర్యాదు చేసి చాలా కాలమైందని పూనమ్ కౌర్ అన్నారు.ఇప్పటివరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ ఫిర్యాదు గురించి స్పందించలేదని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.
నా లైఫ్ ను నాశనం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా లేకుండా చేసిన త్రివిక్రమ్ ను సినిమా ఇండస్ట్రీ ఇప్పటికీ పెద్ద మనిషిగానే ప్రోత్సహిస్తోందని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.అయితే పూనమ్ కౌర్ కామెంట్ల గురించి ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది…పూనమ్ కౌర్ ట్వీట్ కు ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ వచ్చే అవకాశాలు కూడా లేవని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..