ఏపీలో పిల్లల పుస్తకాల బరువు తగ్గించండి: నారా లోకేశ్.

ఏపీలో స్కూలు విద్యార్థులకు పాఠ్యపుస్తకాల బరువు తగ్గించాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. స్కూలు, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా సంస్కరణలు చేయాలన్నారు. ఉన్నత విద్యలో క్యూఎస్ ర్యాంకింగ్స్ లక్ష్యంగా మార్పులు చేపట్టాలని తెలిపారు.