తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
AP: తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు మండిపడుతున్నారు.
పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది….
తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గాయపడిన వారిలో మరో ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఇక మరికొందరి భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. అలాగే మరోవైపు తిరుపతి బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్ దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది.
మరోవైపు తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట జరిగిందని మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపమే దీనికి కారణమంటున్నారు. నిజానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది…
ఈవార్త తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రపుణ్యక్షేత్రంలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఇక ఈఘటనపై సీఎంవో ఆరా తీస్తోంది. మరోవైాపు శుక్రవారం ఉదయం చంద్రబాబు తిరుపతికి వెళ్తున్నారు. మృతులు, గాయపడిన వారి బంధువులతో పాటు భక్తులు టీటీడీ సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే భక్తులు చనిపోయారని ఆరోపిస్తున్నారు. ఆందోళనకు దిగారు..