నేను ముందే చెప్పాను..పోలీసులు మేము చూసుకుంటామని చెప్పారు – తొక్కిసలాట పై కిలక వ్యాక్యాలు చేసిన.టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు..

తిరుపతిలో మొత్తం 3 చోట్ల చోటు చేసుకున్న తొక్కిసలాట

తిరుపతిలో వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల సందర్భంగా.. శ్రీనివాసం, విష్ణు నివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూలు వద్ద తోపులాటలు కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలు

బైరాగిపట్టెడ వద్ద తోపులాటలో భక్తులకు గాయపడగా.. మరికొందరు ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయారు

దీంతో వారిని రక్షించేందుకు పోలీసులు, తోటి భక్తులు CPR చేసి వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు…

టీటీడీ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. దీనికి మనం ఎవరిని నిందించలేము

చింతించటం తప్ప మనం చేసేది ఏమీ లేదు

నేను ముందే చెప్పాను.. పోలీసులు మేము చూసుకుంటామని చెప్పారు – టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు..

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాద సంఘటన చోటుచేసుకుంది. సంధ్య థియేటర్‌ సంఘటన మరచిపోకముందే తిరుపతిలో తొక్కిసలాట చోటుచేసుకుని 6గురు మృతి చెందారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం…..

ఇదిలా ఉండగా టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు… తనకు ఇలా జరుగుతుందని ముందే పోలీసుల్ని హెచ్చరించారని కానీ పోలీసులు మేము చూసుకుంటాంలే అంటూ చిన్న సమాధానం చెప్పి పక్కకు వెళ్లారని… ఓ విధంగా చెప్పాలి అంటే చైర్మన్గా నాదేమీ తప్పులేదు తప్పంతా కూడా పోలీసులదే అనే విధంగా చైర్మన్ మాట్లాడినట్టుగా అర్దం అవుతుందో……. కానీ ఈ విషయంపై భక్తులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు… తిరుపతి బ్రాండ్ ని దెబ్బతీసేలా గతంలో కూడా లడ్డూలు కలిపే నెయ్యి పంచాయతీని రచ్చకేడిచారు…. తిరుపతి బ్రాండ్ ని దెబ్బతీసేలా వ్యవహరించారు అంటూ కొందరు సోషల్ మీడియా లొ గత అధికార పార్టీని,, ప్రస్తుత అధికార పార్టీలను వాటా ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే..

కానీ ప్రస్తుతం తిరుపతిలో తొక్కిసేలాట అంశం భక్తులతో పాటు కుటుంబ సభ్యులను కూడా విషాదఛాయల్లో ముంచేసింది… ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని తీవ్రస్థాయిలో భక్తులు,, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…