కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి..కేటీఆర్‌పై ట్వీట్..!

కాంగ్రెస్ ఎంపీ (Congress MP) చామల కిరణ్ కుమార్‌ రెడ్డి.. కేటీఆర్‌పై (KTR) మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ చేసిన ఘనకార్యాలకు గాను త్వరలోనే ఈడీ, ఏసీబీ, కోర్టులు తగిన గుర్తింపునిస్తాయని ఎద్దేవా చేశారు..తెలంగాణ గురించి కేటీఆర్ చెబుతుంటే నవ్వాలో.. ఎడ్వాలో కూడా అర్థం కాట్లేదని చురకలు అంటించారు. ఎంపీ చామల తన ఎక్స్ ఖాతా వేదికగా కేటీఆర్ మాట్లాడిన వీడియోని పోస్ట్ చేసి విమర్శలు చేశారు.

ఎంపీ తన ఎక్స్ ఖాతాలో.. తెలంగాణ గురించి తెలంగాణకు మీరు చేసిన దాని గురించి నువ్వు చెబుతుంటే నవ్వాలో ఎడవాలో తెలియడం లేదు. తెలంగాణా కు మీరు ఏం చేశారు? 1600 వందలకు పైగా బిడ్డల ప్రాణాలు పణంగా పెట్టి ఎందరో ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో మీరు మీ కుటుంబం చేసిన త్యాగం ఏంటీ డ్రామారావు అని ప్రశ్నించారు. కుటుంబం మొత్తం పదవులు అనుభవించారు తప్ప.. తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి దళిత సమాజాన్ని మోసం చేశారని దుయ్యబట్టారు..ఆర్బీఐ నిబంధనలు తుంగలో తొక్కి రూ. 55 కోట్లు ఎలా దారి మళ్లించారని ప్రశ్నించారు. గ్రీన్ కో కంపనీ ద్వారా ఎలెక్ట్రోల్ బాండ్ల పొందారు అంటే.. క్విడ్ ప్రో కో స్పష్టం అవుతుందని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు రేవంత్ రెడ్డిని పెట్టినా.. చట్టపరంగా ఎదుర్కున్నారు తప్ప మీలా వ్యవహరించలేదని పేర్కొన్నారు..