తెలంగాణలో ప్రముఖ ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ‘హుందాయ్ మోటార్స్’ (Hyundai Motors) రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు..!

తెలంగాణలో పారిశ్రామిక రంగానికి మరో భారీ ఊరట లభించింది. ప్రముఖ ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ‘హుందాయ్ మోటార్స్’ (Hyundai Motors) రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. శుక్రవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో హుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) చాంగ్యో చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ) పరిధిలో రూ. 8,528 కోట్లు పెట్టుబడితో తమ అంతర్జాతీయ స్థాయి రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు హుందాయ్ ప్రతినిధులు సీఎంకు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని యువతకు సుమారు 4,276 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని తెలిపారు. అత్యంత ఆధునిక ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, పైలట్ ప్రొడక్షన్ లైన్, ప్రొటోటైపింగ్ ప్లాట్‌ఫామ్‌లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు స్పష్టం చేశారు.