Game Changer Movie Review…గేమ్ ఛేంజర్’ రివ్యూ…!

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ను వెండితెరపై చూడడానికి ఫ్యాన్స్ దాదాపుగా మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు..
భారీ బడ్జెట్ తో శంకర్ రూపొందించిన ఈ సినిమాపై నమ్మకాలు ఉన్నాయి. అపనమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ 2 గాయబ్ అయ్యినప్పటినుంచి ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం మొదలైంది. అయితే ట్రైలర్ రిలీజ్ తో మళ్లీ బజ్ క్రియేట్ చేసి పాజిటివ్ వైపు టర్న్ చేయగలిగారు..

Game Changer రివ్యూ | Game Changer Movie Review.

ఇక ఈ సినిమా దర్శకుడుగా శంకర్ కు, నిర్మాతగా దిల్ రాజుకు, గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా గా రామ్ చరణ్ కు కీలకమైంది. దాంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది. కథేంటి, శంకర్ మళ్లీ బ్యాంగ్ తో వచ్చి హిట్ ఇచ్చారా, నిజంగానే సినిమా అన్‌ప్రెడిక్టబుల్ గా ఉందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం..

కథ

సొంత ఊరు వైజాగ్‌కి కలెక్టర్‌గా అడుగుపెడతాడు రామ్ నందన్ (రామ్ చరణ్). నీతి, నిజాయితీ ప్రాణంగా బ్రతికే ఈ ఐఏఎస్ ఆఫీసర్‌ కి ఆవేశం కాస్త ఎక్కువే. డ్యూటీ ఎక్కిన వెంటనే అవినీతి పరులపై ఉక్కుపాదం మోపే డ్యూటీ ఎక్కేస్తాడు. అది అవినీతిలో నిండా మునిగి తేలుతున్న మంత్రి బొబ్బిలి మోపిదేవి (ఎస్.జే సూర్య)కి సహజంగానే నచ్చదు.

యథావిధిగా తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోపిదేవి. మోపిదేవి ఎంత దుర్మార్గుడు అంటే అధికారం కోసం తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)నే లేపేస్తాడు. అయితే కొడుకు గురించి పూర్తిగా అర్దం చేసుకున్న సత్యమూర్తి ..ఎవరూ ఊహించని విధంగా రామ్ నందన్‌ని తన వారసుడుగా రాష్ట్ర సీఎంగా ప్రకటిస్తాడు. అది పార్టీలో ఎవరికీ నచ్చదు. మరీ ముఖ్యంగా మోపిదేవికు అసలు నచ్చదు.…దాంతో రామ్ నందన్ సీఎం అవ్వకుండా అడ్డుపడి ఓ మెలిక పెట్టి తనే సీఎం అవుతాడు. కానీ రామ్ నందన్ తక్కువవాడా. తనూ మోపిదేవి కు ట్విస్ట్ ఇస్తాడు. అక్కడ నుంచి ఇద్దరి మధ్యా ఫేస్ టు ఫేస్ వార్ మొదలవుతుంది. ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కి అవినీతి పరుడైన రాజకీయనాయకుడుకి మధ్య జరిగే ఈ యుద్దంలో ఎవరు గెలిస్తారో అందరికీ తెలుసు.

కానీ ఎలా రామ్ నందన్ గెలుస్తాడు అనేది కీలకం. అదెలా జరిగింది, అలాగే అసలు రామ్ నందన్ ఎవరు? అతని ప్లాష్ బ్యాక్ ఏంటి? హఠాత్తుగా రామ్ నందన్‌ని ఎందుకు సత్యమూర్తి…. సీఎంగా ప్రకటించాడు? అలాగే అప్పన్న (రామ్ చరణ్)కి రామ్ నందన్‌కి ఉన్న రిలేషన్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ

ఇక యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రకారం ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ కార్తీక్ సుబ్బరాజు కథ తీసుకున్నప్పటికి ఈ కథని తను ఓన్ చేసుకొని మరి డైరెక్షన్ చేశాడట. అందువల్లే ఈ సినిమాలో ప్రతి పాయింట్ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉందని మొదటినుంచి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిందని సినిమాని చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇంటర్వెల్ కి ముందు ఒక 20 నిమిషాలు సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వ రూపాన్ని చూపించాడంటూ వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి రామ్ చరణ్ తన నటనలో మంచి పరిణితిని ఈ సినిమాలో మనం చూడొచ్చని కూడా చెబుతున్నారు. ఇక ‘రంగస్థలం’, ‘త్రిబుల్ ఆర్ ‘ తర్వాత అంత మంచి పాత్రను పోషించిన రామ్ చరణ్ ఈ సినిమాతో మరోసారి తన విజయకేతనాన్ని కూడా ఎగరవేశారు అంటూ వాళ్ళు చెబుతూ ఉండటం విశేషము…

దర్శకుడు శంకర్ మొదటి నుంచి ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లడట. కథ విషయంలో గాని స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఆయన ఎక్కడ తడబడకుండా ముందుకు సాగుతూ ఉండడం తద్వారా డైరెక్షన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేశారట. ఇక కొన్ని సీన్స్ ని విజువల్ వండర్ గా తెరికెక్కించడంలో కూడా శంకర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందని సెకండాఫ్ మొత్తం చాలా ఫాస్ట్ గా సాగుతుందంటూ ఎక్కడ బోర్ కొట్టకుండా క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ కథలో ప్రతి ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ శంకర్ ఈ సినిమాని చేశాడంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలైతే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యూఎస్ఏ ప్రేక్షకులు ఈ సినిమాని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశామంటూ చెబుతుండటం విశేషం… ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన రామ్ చరణ్ ప్రతి పాత్రలో కూడా తను వేరియేషన్స్ అయితే చూపించినట్టుగా తెలుస్తోంది…

సెకండాఫ్ కు వచ్చేసరికి మంత్రికి, ఓ ఐఏఎస్ కు మధ్య జరిగే కథగా ఇదీ ఫార్ములానే నడుస్తుంది. ఎక్కడా మనకు ఊహకు అందని మలుపులు కనపడవు. అలాగే హై ఇచ్చే ఎలిమెంట్స్ చాలా పరిమితంగా ఉంటాయి. ఇలాంటి భారీ సినిమాల్లో ఈ మధ్యన హై ఇచ్చే ఎలిమెంట్స్ దే ప్రాధాన్యత అన్నట్లుగా ఉంటున్నాయి. జనం అవే ఎదురుచూస్తున్నారు. అవి మిస్సయ్యాయి. ఒకే ఒక్కడు, శివాజీ వంటి శంకర్ సినిమాలు పదే పదే గుర్తు వస్తూంటాయి.

సినిమాలో శంకర్ మార్క్ ఎక్కడ బాగా కనపడుతుంటే విజువల్స్ లోనూ, సెకండాప్ లో వచ్చే అప్పన్న ఎపిసోడ్ లోనే. శంకర్ సినిమాల్లో కనిపించే ఎమోషన్స్ సైతం ఇందులో కనిపించవు. కథ దానిపాటికి అది నడుస్తూంటుంది కానీ మన హృదయాల్లోకి వెళ్లి ఇది మన కథే, హీరో గెలివాలి అనిపించేటంత భావోద్వేగాలు రైజ్ చేయలేకపోయారు. ఏమైపోయింది అపరిచితుడు, జెంటిల్ మ్యాన్, ఒకే ఒక్కడు నాటి మ్యాజిక్ అని పదే పదే అనిపిస్తుంది..

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను అలరించడానికి మరోసారి సిద్ధమయ్యారట. ఇక ఇప్పటికే యూఎస్ఏ ప్రేక్షకులు రామ్ చరణ్ యాక్టింగ్ చూసి మరోసారి సినిమా టికెట్లను బుక్ చేసుకొని సినిమా చూడాలనే ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కథలో మొదటి నుంచి చివరి వరకు రామ్ చరణ్ చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సినిమా మొత్తాన్ని తను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లడని కూడా చెబుతున్నారు. ఎస్ జె సూర్య యాక్టింగ్ చాలా కన్నింగ్ గా ఉండటమే కాకుండా అందులో వేరియేషన్స్ ని కూడా చూపిస్తూ సినిమా మీద మరోసారి హైప్ ను పెంచాడు.

ఇక ఈ సినిమాతో ఆయన తెలుగులో విలన్ గా సెటిలైపోవచ్చు అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. అలాగే అంజలి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉందట. ఆమె వల్లే సినిమా కథ మొత్తం చేంజ్ అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా అంజలి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రని పోషించిందని కూడా జనాలు చెబుతుండడం విశేషం… వెన్నెల కిషోర్, సునీల్ లాంటి నటులు కూడా కామెడీని పండించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది…

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ ఈ సినిమాకు చాలా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడినర్ గా ఉండటమే కాకుండా శంకర్ ఏదైతే కోరుకున్నాడో దాన్ని విజువల్ వండర్ గా స్క్రీన్ మీద చూపించడంలో సినిమాటోగ్రాఫర్ చాలా వరకు హెల్ప్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది…

ప్లస్ లు

పాటలు, గ్రాండియర్ గా తీసిన విజువల్స్
రామ్ చరణ్ లోని నటుడుని బయిటకు తీసుకువచ్చిన సీన్స్
అప్పన్న ఎపిసోడ్

మైనస్ లు
పాత గా అనిపించే కథ, అందుకు తగినట్లే మరింత సాగే కథనం
కియారా అద్వాని, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు
ఎమోషన్స్ ఈ భారీ సినిమాకు తగిన స్దాయిలో పండించలేకపోవటం