కల్లు, మటన్ కే వైబ్’ మాటకు.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్తున్న..దిల్‌ రాజు..!

తెలంగాణ ప్రజలకు ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ �క్షమాపణలు (Dil Raj Apology)�చెప్పారు..
ఇటీవల నిజామాబాద్ లో నిర్వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’� (Sankranthiki Vasthunam) సినిమా ట్రైలర్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా దిల్ రాజ్ స్పందించారు. ‘నిజామాబాద్ జిల్లా వాసిగా నా సినిమా ఈవెంట్ ను అక్కడ చేశాను. ఈ ఈవెంట్ లో నేను మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాత్రమే మాట్లాడాను. కానీ నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను మన కల్చర్ ను అభిమానించే వ్యక్తిని. నిజంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించాలని కోరుతున్న. ఫిదా, బలగం వంటి తెలంగాణ సంస్కృతితో ముడిపడిన సినిమాలు నిర్మించాను. వీటికి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. తెలంగాణ ప్రజలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ సినిమాలను, మమ్మల్నీ గుండెలకు అత్తుకున్నారు. తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణను ఎలా అవమానిస్తానని, హేళన చేస్తారని అనుకున్నారో నాకు తెలియదు. అయినా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నన్ను క్షమించాలి. తెలంగాణలోని (Telangana) అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను రాకీయాల్లోకి లాగకండి. టీఎఫ్ డీసీ (TFDC) లో సినిమా రంగ అభివృద్ధి కోసమే పని చేస్తాను తప్ప అది రాజకీయాలకు సంబంధించినది కాదు’ అంటూ వివరణ ఇచ్చారు. ఈమేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తాజాగా ఎక్స్ ఖాతాలో దిల్ రాజ్ వీడియోను రిలీజ్ చేసింది..
https://x.com/Hyderabad_Mail/status/1878003622279303345?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1878003622279303345%7Ctwgr%5E19a745a40bc44a66559dc7b2e2223e68985cb538%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F