డాకు మహారాజ్ మూవీ రివ్యూ….

నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, టామ్ చాకో, సత్య,.

తారాగణం:
నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, టామ్ చాకో, సత్య,
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
డైరెక్షన్: బాబీ కొల్లి
విడుదల తేది: 12-1-2025.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)..

స్టోరీ :
నానాజీ (బాలకృష్ణ) ని మదనపల్లి హిల్స్ స్టేషన్‌లో సంపన్న కుటుంబానికి చెందిన యువతిని రక్షించేందుకు నియమిస్తారు. మరోపక్క సీతారాం (బాలకృష్ణ) మరియు అతని భార్య (ప్రగ్యా జైశ్వాల్‌) మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతంలోని నీటిపారుదల ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ ప్రాంతంలో శక్తివంతమైన ఠాకూర్ కుటుంబం చాలా ఇస్తూ ఉంటారు. వీరు మార్బుల్ మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఇక గ్రామస్తులు ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరతతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి సమయంలో సీతారాములు వారికి అండగా నిలిచి ఉగ్ర మహారాజుగా మారతాడు. అల సీతారాం మరియు ఠాగూర్ కుటుంబానికి మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ నేపథ్యంలోనే మిగతా కథ నడిచింది..

మరో ప్రక్క ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ (మలయాళ నటుడు షైన్ టామ్ చాకో) ‘డాకు ఎక్కడ?’ అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు. ఇక పాపను, కుటుంబాన్ని రవికిషన్ ఏమీ చెయ్యలేకపోవటంతో, వాళ్ళను ఎలాగైనా అంతమొందించి, అక్కడ ఎస్టేట్ లో ఉన్న తమ మాల్ ని తీసుకెళ్లాలని ఠాకూర్( మెయిన్ విలన్ బాబీ డియోల్) ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు బాబీడయోల్ కు బాలయ్య గురించిన ఓ నిజం తెలుస్తుంది.

అలాగే ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ కు సైతం బాలయ్య ఎవరో తెలుస్తుంది. అతను మరవరో రాదు డాకూ మహారాజ్ అని గుర్తిస్తాడు. అసలు ఈ డాకూ మహారాజ్ ఎవరు…ఆ పాప కుటుంబానికి, అతనికి సంభందం ఏమిటి…ఆ స్దాయి వ్యక్తి ఓ డ్రైవర్ గా వాళ్ల ఇంట్లో చేరాల్సిన అవసరం ఏమిటి, బాబీ డయోల్ కు బాలయ్యకు మధ్య ఉన్న వైరం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ :

స్టార్ హీరో బాలయ్య సినిమాలు అంటే ప్రేక్షకులు కచ్చితంగా కొన్ని అంశాలను ఆశిస్తారు. డైలాగ్స్ అద్భుతంగా ఉండాలని, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లు ఉండాలని, కళ్లు చెదిరే ఎలివేషన్ సీక్వెన్స్ లు కావాలని ఫీలవుతారు. ఇవి కోరుకుని సినిమా చూసే అభిమానులను డాకు మహారాజ్ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని చెప్పవచ్చు. బాలయ్య గత సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంది.

బాబీ డియోల్ మైనింగ్ కింగ్ గా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. డాకు మహారాజ్ తర్వాత బాబీ డియోల్ కు తెలుగులో మరిన్ని మూవీ ఆఫర్లు వచ్చినా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలకు మరీ ఎక్కువగా ప్రాధాన్యత లేకపోయినా వాళ్లు తన రోల్స్ కు న్యాయం చేశారు. థమన్ ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎదిగారు. బీజీఎం విషయంలో తనకు ఎవరూ సాటిరారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. నిర్మాత నాగవంశీ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ, ఎడిటర్స్ రూబేన్, నిరంజన్ దేవరమానే పనితీరు బాగున్నాయి.

టెక్నికల్ గా …

పెద్ద బ్యానర్, పెద్ద హీరో సినిమా కాబట్టి టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉన్నాయి. దర్శకుడు బాబీ పూర్తిగా స్టైలిష్ మేకింగ్, విజువల్ క్వాలిటీ మీదే దృష్టి పెట్టారు,మిగతావి పట్టించుకోలేదు. పాటలు సోసోగా ఉన్నాయి. దబిడి దబిడి సాంగ్ కు ఉన్నంతలో మంచి రెస్పాన్స్ వచ్చినట్లే.

విజయ్ కార్తీక్ కెమెరా వర్క్ సినిమాకు పెద్ద ప్లస్. ఓ రకంగా అదరకట్టాడని చెప్పాలి. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ … అనిరిధ్ కి పోటీ ఇచ్చేలా కొన్ని చోట్ల సాగింది. ఎడిటింగ్ మరింత షార్ప్ గా చేయవచ్చేమో అనిపించింది. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ ఇంకా పూర్తి కాదు. రిపీట్ గా సీన్స్ వస్తున్న ఫీల్ వచ్చినప్పుడు…

బాలకృష్ణ ఇమేజ్ లోబడి.. మాస్, కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేసి రూపొందించిన ఎమోషనల్ డ్రామా డాకు మహారాజ్. అయితే ఫస్టాఫ్‌ను బ్రహ్మండంగా ఎలివేట్ చేసినప్పటికీ.. క్లైమాక్స్‌లో సింపుల్‌గా ముగించేసి.. తడబాటుకు గురయ్యాడా? అనే ఫీలింగ్ కలుగుతుంది. బోయపాటి రేంజ్‌లో మాస్ డైలాగ్స్‌ ఇంకా జొప్పించి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. రెగ్యులర్, రొటీన్ పాయింట్‌తో బాలయ్యను మరోసారి మాస్ అవతారంతో మ్యాజిక్ చేసే ప్రయత్నం కనిపించింది. నందమూరి ఫ్యాన్స్‌కు, సంక్రాంతి ఆడియెన్స్‌కు ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. కొత్తదనం ఆశించకుండా వెళితే.. భావోద్వేగమైన అంశాలు మంచి అనుభూతిని పంచుతాయి…

ప్లస్ పాయింట్స్

డాకు మహారాజ్ బాలయ్య హై ఓల్టేజ్ యాక్షన్

నిర్మాణ విలువలు

తమన్ ఆర్ఆర్

మైనస్ పాయింట్స్

రొటిన్ స్టోరీ, స్క్రీన్ ప్లే

సాంగ్స్

ఫస్ట్ హాఫ్

ఎడిటింగ్..

కథ మొత్తం కూడా బాలయ్య వెనకే జరుగుతుంది…