మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం..!..డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు..!

*Breaking*

*🔹మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం*

ఒకేసారి రెండు కారు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పిన ఆయన ప్రయాణిస్తున్న కారు

డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ముప్పు

వరంగల్ నుండి ఖమ్మం వెళ్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఘటన..

సంక్రాంతి(Sankranti) పండుగ వేళ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy)కి భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుండి ఖమ్మం వైపునకు వస్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలాయి. దీంతో కారు కంట్రోల్ తప్పింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచఖ్యంతో వ్యవహరించడంతో పెను ముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం(Tirumalayapalem) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి పొంగులేటికి ఏం జరుగకపోవడంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఆయనతో కారులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ..