Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా …

*నేడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం*
Donald Trump.

* ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు
* అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న ట్రంప్‌
* రాత్రి 10:30 గంటలకు ట్రంప్‌ ప్రమాణ స్వీకారం
* ప్రమాణ స్వీకారం సందర్భంగా భద్రత కట్టుదిట్టం
* వాషింగ్టన్‌లో 25 వేల మందితో భారీ భద్రత
* నిన్న వంద మంది ప్రముఖులకు ట్రంప్‌ విందు
* ట్రంప్‌ విందుకు హాజరైన అంబానీ దంపతులు…

: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా ప్రభుత్వ యంత్రాంగం, ప్రపంచ దేశాల నేతలు, వ్యాపార దిగ్గజాల సమక్షంలో క్యాపిటల్ హిల్‌ రొటుండాలో అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. దేశ కోసం సర్వశక్తుూ ఒడ్డుతానంటూ బైబిల్ చేతిలో ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు..