🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 22 – 01 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *అష్టమి* మ1.17 వరకు,
నక్షత్రం : *స్వాతి* రా1.00 వరకు,
యోగం : *శూలం* తె3.33 వరకు,
కరణం : *కౌలువ* మ1.17 వరకు
తదుపరి *తైతుల* రా2.17 వరకు,
వర్జ్యం : *లేదు*
దుర్ముహూర్తము : *ఉ11.49 – 12.33,*
అమృతకాలం : *మ3.15 – 5.02,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.45,
*_నేటి మాట_*
*దైవానికి కృతజ్ఞత ఎలా చూపాలి??*
ఈరోజు మనం అనుభవించే ప్రతీ పనికి దైవానికి కృతజ్ఞత చూపాలి, అది ఎలా అంటే??…
మన హృదయాన్ని ఆయనకు అర్పించడమే కృతజ్ఞత.
ఇంకా … మనలోని అహంకారాన్ని త్యజించాలి, ఈ మాత్రం కృతజ్ఞతా చూపించక పోతే, ఎన్నియో జన్మ లెత్తి, కష్టములు పడి, బాధలకు గురి కావలసి ఉంటుంది.
కృతజ్ఞతా పూర్వకంగా అంజలిఘటించి, మంచి గుణములను ఇవ్వమని ప్రార్ధించాలి…
సద్బుద్ధిని ప్రసాదించమని వేడుకోవాలి,
ఒక భక్తుడు నిరంతరం కృష్ణా! కృష్ణా! అని ప్రార్ధించేవాడు…నామస్మరణ చేసేవాడు.
అయితే, కృష్ణుడు ఒక్కొక్క పిక్చరులో ఒక్కొక్క రకంగా ఉంటాడు.
ఏ కృష్ణుణ్ణి ఆరాధించాలి, అని అతనికి సందేహం వచ్చింది…
ఈ పిక్చర్లన్నీ ఎవరికి తోచిన విధంగా వారు కల్పించినవే! ఎవరికి నచ్చినట్లు వారు మేకప్ చేస్తారు, కృష్ణుని నిజ స్వరూపం ఇదికాదు.
ఆనందమే కృష్ణుని నిజ స్వరూపం.
తాను ఎప్పుడు ఆనందంగా ఉండి ఇతరులను ఆనందంగా ఉండమనేవాడు.
అదే రీతిగా మనము కూడా ఎప్పుడు ఆనందంగా ఉండి ఇతరులకు ఆనందం అందించాలి.
మూతి ముడుచుకొని ఉండకూడదు, ఏవో కొన్ని బాధలు, కష్టములు వచ్చి పోతూ ఉంటాయి.
అవన్నీ కదిలే మేఘాలవంటివి, కాబట్టి అటువంటి వాటికి విచారించకూడదు.
ధృడమైన విశ్వాసము తో దైవాన్ని ప్రార్ధించాలి, భూతాకాశమును పూర్తిగా మర్చిపోవాలి, చిత్తాకాశమును కొంత వరకూ గుర్తుంచుకోవాలి, చిత్తాకాశము నుండి చిదాకాశము లోనికి ప్రవేశించాలి… ఇదే మానవుడు తుదకు చేరే ప్రస్థానం…
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏