ఈశాన్యరాష్ట్రం మణిపుర్ (Manipur)లో రాజకీయంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అక్కడి భాజపా సర్కార్కు జేడీయూ (JDU) షాక్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నీతీశ్కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని ఈ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది..
మణిపుర్లో జేడీయూ పార్టీ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. భాజపాకు తమ మద్దతు ఉండదని వెల్లడించారు. తమకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నాసిర్ ప్రతిపక్షంలో ఉంటారని తెలిపారు.
ఈ ప్రకటనను జేడీయూ అధినాయకత్వం తోసిపుచ్చింది. మణిపుర్లో భాజపా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామంటూ వచ్చిన వార్తలను జేడీయూ తోసిపుచ్చింది. అవన్నీ నిరాధారమని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ వెల్లడించారు. అది క్షేత్రమయుం బీరెన్ సింగ్ తన సొంతంగా చేసిన ప్రకటన అని, ఆయన జాతీయ నాయకత్వాన్ని సంప్రదించలేదని తెలిపారు. దీనిని క్రమశిక్షణారాహిత్య చర్యగా భావించి, ఆయన్ను పదవి నుంచి తప్పించినట్లు వెల్లడించారు.
మణిపుర్లో 2022లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 6 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికలు జరిగిన కొద్దినెలల్లోనే ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాలో చేరిపోయారు. 60 స్థానాలున్న మణిపుర్ అసెంబ్లీలో భాజపాకు 37 మంది సభ్యులున్నారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ నుంచి ఐదుగురు, స్వతంత్రులు ముగ్గురి మద్దతు ఉంది. దీంతో ఇప్పుడు ఎన్. బీరెన్ సింగ్ నేతృత్వంలోని సర్కార్కు ఎలాంటి ఢోకా లేదు. కానీ కేంద్రం, బిహార్లో ఎన్డీయే కూటమిలో కీలక పక్షమైన నీతీశ్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడం, కాసేపటికే అధినాయకత్వం నిర్ణయం కాదంటూ వివరణ ఇవ్వడం గందరగోళానికి గురిచేసింది..
ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు..
ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ (Rajiv Ranjan Prasad) వివరణ ఇచ్చారు. పార్టీ జాతీయ నాయకత్వాన్ని సంప్రదించకుండా మణిపూర్ జేడీయూ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు క్షేత్రమయుం బీరేన్ సింగ్ సొంతంగా ప్రకటన చేసినట్టు చెప్పారు. బీరేన్సింగ్ను క్రమశిక్షణారాహిత్యం కింద పదవి నుంచి తొలగించినట్టు వెల్లడించారు.
దీనికి కొద్ది నిమిషాలకు ముందే మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపంసహరించుకున్నట్టు క్షేత్రమయుం బీరేన్ సింగ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. బీజేపీకి తమ మద్దతు ఉండదని, జేడీయూ ఏకైక ఎమ్మెల్యే అబ్దుల్ నాసిర్ ఇక నుంచి ప్రతిపక్షంలో కూర్చుంటారని తెలిపారు