మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, క్షతగాత్రుల చికిత్స ఖర్చులు భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది..బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు వ్యాపించినట్టు వదంతులు వ్యాపించాయి. దీనితో భయంతో ప్రయాణికులు ఆ రైలు చైన్లాగి పట్టాలపై దిగారు. అయితే పట్టాలు దాటుతుండగా పచోరా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వచ్చి వారిని ఢీకొట్టంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.